Home / TELANGANA / విద్యుత్ సంస్థలపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారు..!!

విద్యుత్ సంస్థలపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారు..!!

విద్యుత్ సంస్థలపై కొంతమంది కావాలనే అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని సీఎండీ ప్రభాకర్ రావు మండిపడ్డారు. విద్యుత్ సౌధలోల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “రాష్ట్రం రాకముందు విద్యుత్ పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. కొందరు విద్యుత్ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేశారు. బహుశా సమాచార లోపంతోనే అలా మాట్లాడి ఉంటారు అనుకుంటున్నారు. ఏన్టీపీసీ ఎప్పుడు తక్కువకు విద్యుత్ ఇస్తానని చెప్పలేదు.3600 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తిలో తెలంగాణ టాప్. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 7778 మెగావాట్ల నుంచి ఇప్పుడు 16200 మెగావాట్ల కు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం.రాష్ట్రం వచ్చిన కొత్తలో 800 మెగావాట్ల ప్లాంట్ ప్రారంభించు కున్నాం.మేము చెప్పేది వాస్తవాలు.వాళ్ళు చేసేవి అవగాహన లేని ఆరోపణలు. ముఖ్యమంత్రి దూర దృష్టితోనే రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు అధిగమించాం.ఇటీవలే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ కూడా తెలంగాణ విద్యుత్ పనితీరును ప్రశంసించారని చెప్పారు.