Home / ANDHRAPRADESH / బ్రేకింగ్..కోడెల అవినీతి, అక్రమాలను ఒప్పుకున్న చంద్రబాబు…!

బ్రేకింగ్..కోడెల అవినీతి, అక్రమాలను ఒప్పుకున్న చంద్రబాబు…!

టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావును టీడీపీ వదిలించుకోవాలని చూస్తుందా..కోడెల అవినీతి, అక్రమాలను చంద్రబాబు ఒప్పుకున్నాడా…ఇక కోడెలను ఎవరూ కాపాడలేరా…అంటే తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమే అనిపిస్తోంది. కోడెల ఫ్యామిలీ అరాచకంపై నరసరావు, సత్తెనపల్లి టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. కే ట్యాక్స్ పేరుతో కోడెల ఫ్యామిలీ చేసిన పలు అక్రమ దందాలపై పోలీసులు కేసులు నమోదు చేసినా కూడా బాబు స్పందించలేదు. అయితే అసెంబ్లీ ఫర్నీచర్‌ తరలింపు విషయంలో కోడెల అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కోడెలపై కేసు నమోదు చేశారు. కోడెల, అతని కొడుకు, కూతురు అవినీతి, అక్రమాలపై సర్వత్రా విమర్శలు ఎదురవుతుండడంతో ఎట్టకేలకు చంద్రబాబు స్పందించాడు. తాజాగా కోడెల వ్యవహారంపై మాట్లాడిన చంద్రబాబు … అక్రమాలకు పాల్పడితే కోడెలను శిక్షించవచ్చని.. అలాగని కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదంటూ హెచ్చరించారు.

కోడెల ఫ్యామిలీతో సహా వరుసగా కేసుల్లో ఇరుక్కుపోతుండడంతో పార్టీ పరువు బజారున పడుతుందని గ్రహించిన చంద్రబాబు స్టాండ్ మార్చుకున్నట్టు అర్థమవుతోంది.. ఇన్నాళ్లు కోడెల ఫ్యామిలీ అరాచకాలను చూస్తూ ఉన్న చంద్రబాబు..ఇక ఉపేక్షిస్తే…టీడీపీకే ప్రమాదమని గ్రహించాడు. దీంతో తప్పు చేసినట్లయితే శిక్షించండి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో చంద్రబాబు పరోక్షంగా కోడెల తప్పు చేశాడని ఒప్పుకున్నట్లే అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే కోడెల ఫ్యామిలీని పార్టీ నుంచి బహిష్కరించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. అందుకే వర్ల రామయ్య లాంటి నేతలు అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో కోడెలను తీవ్రంగా విమర్శించారు.

టీడీపీ నుంచి ఎవరినైనా తప్పించాలంటే…ముందు వాళ్ల ఇమేజ్ డ్యామేజీ అయ్యేలా తన పార్టీ నేతలతో తిట్టించి, వారి అవినీతి, అక్రమాలపై ఎల్లోమీడియా ఛానళ్లలో వరుస కథనాలు ప్రసారం చేయించి..తీరిగ్గా పంపించేయడం చంద్రబాబు స్టైల్. ఇప్పుడు కోడెల విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నాడు. అందుకే కోడెలపై మద్దతుగా టీడీపీ నుంచి ఎవరూ మాట్లాడడం లేదు. పైగా సొంత పార్టీ నేతలే కోడెల అవినీతిపరుడు అంటూ విమర్శలు చేస్తున్నారు. సో…కోడెల ఫ్యామిలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టే తప్పు చేస్తే శిక్షించండి అంటూ చంద్రబాబు చెప్పాడని టీడీపీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా కోడెల ఫ్యామిలీని వదిలించుకునేందుకు చంద్రబాబు స్కెచ్ వేశాడని తెలుస్తోంది. దీంతో త్వరలోనే కోడెల తన కొడుకు, కూతురుతో సహా జైలుకు పోవడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat