Home / ANDHRAPRADESH / దరువుకు ఏపీ ప్రభుత్వంచే మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు

దరువుకు ఏపీ ప్రభుత్వంచే మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు

సోషల్ మీడియా సంచలనం…దరువుకు ఏపీ ప్రభుత్వం మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు అవార్డు ప్రదానం చేసింది. ఈ విషయాన్ని దరువును ఆదరిస్తున్న మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. సిహెచ్ కరణ్ రెడ్డి సారథ్యంలో ఐదేళ్ల క్రిందట ప్రారంభమైన మా దరువు మీడియా ప్రస్థానం తెలుగు ప్రజల ఆశీస్సులతో అప్రతిహాతంగా సాగిపోతుంది. అనతి కాలంలోనే తెలుగు ప్రజల గొంతుగా దరువు మీడియాను తీర్చిద్దారు కరణ్ రెడ్డి. వాస్తవిక దృక్పథంతో , క్రియేటివీ, రిలైబుల్ కంటెంట్‌తో దరువు వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్ వెబ్‌ మీడియా రంగంలో తనదైన ముద్ర వేశాయి. తెలుగు రాష్ట్రాలలో ప్రధాన మీడియా సంస్థలన్నీ ఆయా రాజకీయ పార్టీల బాకాలుగా మారిన తరుణంలో…తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిజాలను నిర్భయంగా చాటుతూ… ప్రజల సమస్యలపై గళమెత్తిన ఏకైక వెబ్ మీడియా.దరువు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటుతూ…ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలబడింది దరువు. కొత్త రాష్ట్రంలోరాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కావాలని మా దరువు మీడియా భావించింది. అందుకే తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా దరువు నడుచుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే పనులను స్వాగతిస్తూనే.. జరిగే తప్పులను ఎత్తిచూపుతూ… తెలంగాణ పునర్నిర్మాణంలో నిర్మాణాత్మక పాత్ర పోషించింది మా దరువు మీడియా.

ఇక తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎండీ కరణ్ రెడ్డి ఆధ్వర్యంలో దరువు యూట్యూబ్ ఛానల్ రాష్ట్రమంతటా 119 నియోజకవర్గాల్లో విజయవంతంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించింది. 2018 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా 90 స్థానాలు గెల్చుకుంటుందని దరువు తేల్చిచెప్పింది. దేశంలో ప్రఖ్యాతి గాంచిన సర్వే సంస్థలు, జాతీయ మీడియా ఛానళ్లు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లు, వివిధ వెబ్‌సైట్లు ప్రకటించిన ఫలితాల కంటే..దరువు మీడియా ప్రకటించిన ఫలితాలు వంద శాతం నిజం అయ్యాయి. టీఆర్ఎస్ సరిగ్గా 90 స్థానాలు గెల్చుకుని చరిత్ర తిరగరాసింది. ప్రజల నాడీని పసిగట్టడంలో జాతీయ మీడియా ఛానళ్లు, వివిధ సర్వే సంస్థలు, తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన ఛానళ్లు విఫలం కాగా… దరువు ప్రకటించిన సర్వే ఫలితాలు వందకు వంద శాతం నిజం అయ్యాయి.

ఇక గత ఐదేళ్లలో ఏపీ ప్రజల నిజమైన గొంతుగా మారింది దరువు. చంద్రబాబు హయాంలో పై స్థాయి నుండి గ్రామస్థాయి వరకు జరుగుతున్న అవినీతిని నిర్భీతిగా ఎండగట్టింది. రాజధాని పేరుతో అమరావతిలో టీడీపీ పెద్దలు సాగించిన భూకుంభకోణాలను, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను, పోలవరంలో జరుగుతున్న అవినీతిని, కాల్‌మనీ సెక్స్ రాకెట్, విశాఖ భూకుంభకోణంపై..ఇలా టీడీపీనేతల అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేసింది. ఎల్లోమీడియా నిజాలను దాచి అధికార పార్టీకి కొమ్ము కాస్తుంటే..కేవలం ఒక్క దరువు మీడియా మాత్రమే వాస్తవిక కథనాలతో, టీడీపీ అవినీతి, అక్రమాలను బట్టబయలు చేసింది. అధికార పార్టీ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్ష వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా దరువు మీడియా రాజీలేని పోరాటం చేసింది . నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ దరువు విస్తృతంగా ప్రచారం చేసింది. టీడీపీ అరాచకాలపై, దరువు వెబ్‌సైట్ కథనాలు, యూట్యూబ్ ఛానల్ ప్రసారాలు ప్రజలను విపరీతంగా ప్రభావితం చేశాయి. దరువు టీవీ రూపొందించిన వీడియోలు, వ్యంగ చిత్రాలు, కార్టూన్ , సెటైరికల్ వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారేవి. టీడీపీ ఘోర పరాజయంలో దరువు టీవీ తన వంతు పాత్ర పోషించింది.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో దరువు యూట్యూబ్ ఛానల్‌ ఏపీ అంతటా పర్యటించింది. దాదాపు 175 నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి, క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 కు పైగా స్థానాలు గెల్చుకుంటుందని దరువు సర్వే ఫలితాలు ప్రకటించింది. ప్రధాన జాతీయ ఛానళ్లు, దేశంలోనే పేరుగాంచిన సర్వే సంస్థలు, ప్రాంతీయ ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లు, వివిధ వెబ్‌సైట్లు ప్రకటించిన సర్వేఫలితాలు…దరువు ప్రకటించిన ఫలితాలకు దరిదాపుల్లోకి లేకపోవడం గమనార్హం. రాజకీయ వత్తిడులకు, ప్రలోభాలకు లొంగకుండా నిజాన్ని నిర్భయంగా చాటడం దరువుకు మాత్రమే సాధ్యం. కేవలం వెబ్‌మీడియాలోనే కాదు…సర్వేలలో నిష్పక్షపాత, ప్రామాణికత పాటించడంలో దరువు తనకు తానే సాటి అని సగర్వంగా చాటుకుంది. అందుకే ఏపీ ప్రభుత్వం మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు మా దరువుకు ప్రకటించింది. ఇది దరువు ఎండీ కరణ్ రెడ్డి టీమ్ సాధించిన విజయం. ఈ అవార్డు మా దరువు వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్‌ను ఆదరించిన ఏపీ ప్రజలందరికీ అంకితం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ అవార్డు ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే ఉత్సాహంతో ఇంతే, నిబద్దతతో మా దరువు మీడియా తెలుగు ప్రజల గొంతుగా సాగుతూనే ఉంటుంది. త్వరలోనే మా దరువు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నదని తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అపార అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ కరణ్ రెడ్డి సారథ్యంలో అతి త్వరలో దరువు 24×7 టీవీ రాబోతుంది. దరువు వెబ్‌మీడియాను ఆదరించినట్లే మా దరువు టీవీని కూడా ‎ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం.

మీ
దరువు యాజమాన్యం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat