ప్రస్తుతం టాలీవుడ్ లో సమంత అక్కినేని, నాగచైతన్య ఆదర్శ దంపతులని చెప్పాలి. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకొని లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. వీరికి 2017లో పెళ్లి అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట పర్సనల్ వెకేషన్ పై స్పెయిన్ వెళ్లారు. ఫాన్స్ ను ఆనందపరచడానికి కొన్ని ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. సమంత కొన్ని ఫొటోస్ ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఫాన్స్ కు షేర్ చేసింది. టాలీవుడ్ లో ఈ జంట ఎంజాయ్ చేసినంతగా వేరెవ్వరూ చేసుండరు. ఇక మరికొందరు అయితే సమంత అక్కినేని ఫ్యామిలీలో అడుగుపెట్టినప్పటి నుంచి తన అదృష్టం మారిపోయిందని చెప్పుకుంటున్నారు. అప్పుడు సమంత కన్నా ఇప్పుడు అక్కినేని సమంత గా మారిన తర్వాతే ఈ ముందుగుమ్మ మరింత ఫేమస్ అయ్యిందని ట్రోల్ అవుతుంది.