Home / ANDHRAPRADESH / చంద్రబాబు దోపిడీపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు…!

చంద్రబాబు దోపిడీపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు…!

చంద్రబాబు హయాంలో అమరావతి, పోలవరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎస్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఏపీ రాజధాని అంశంపై విలేకరులతో మాట్లాడిన జీవీఎల్  బాబు సర్కార్ స్విస్, సింగపూర్ ఛాలెంజ్‌ పేర్లతో రాజధాని నిర్మాణం పేరిట వేల కోట్ల రూపాయలు దోచుకుందని జీవీఎల్ ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో కొంత ఖర్చుపెట్టి మిగతా మొత్తం టీడీపీ పెద్దలు నొక్కేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు సర్కార్ తమకు అనుకూలమైన కంపెనీలకు, వ్యక్తులకు చౌక ధరకు పెద్ద ఎత్తున రైతుల భూములను కట్టబెట్టి భారీగా లబ్ది పొందారంటూ జీవీఎల్‌ టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాజధాని భూములలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నది బహిరంగ రహస్యం. అయితే ఎలా జరిగిందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అసలు రాజధాని నిర్మాణానికి 5 వేల ఎకరాలు సరిపోతాయని…చంద్రబాబు ప్రభుత్వం అవసరానికి మించి 30 వేల ఎకరాలు సేకరించిందని జీవియల్ చెప్పుకొచ్చారు. చదరపు అడుగుకు 10 వేలు అధికంగా ఖర్చుచేసి ప్రజా ధనాన్ని లూటీ చేసింది కాక, పైగా ఇప్పుడు రాజధానిని వైసీపీ ప్రభుత్వం తరలిస్తుందంటూ టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారంటూ   మండిపడ్డారు.  ఇక రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం..కేంద్రప్రభుత్వం సూచనలతో చేసేది కాదని జీవీఎల్ స్పష్టం చేశారు. అమరావతిపై పలు వార్తలు వస్తున్నాయి కనుక.. భూములు ఇచ్చిన రైతుల పరిస్థితులు ఏంటన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జీవిఎల్ డిమాండ్ చేశారు.

ఇక చంద్రబాబు హయాంలో పోలవరంలో భారీగా అవినీతి జరిగిందని జీవిఎల్ తేల్చి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ పెద్దలు ఎస్టిమేషన్లు పెంచేసి, భారీగా కమీషన్లు నొక్కేసారని అన్నారు. దాదాపుగా 5800 కోట్ల హెడ్ వర్క్స్ పనులను మూడు కంపెనీలకు ఇచ్చారు. ఇందులో భాగంగా 2346 కోట్ల రూపాయలు హెడ్ వర్క్స్ పనుల్లో అధికంగా చెల్లించారని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది.కాంట్రాక్టర్లు అందరికీ ముందుగానే ఈ చెల్లింపులను పూర్తి చేశారు. ఎవరు చెబితే అధిక చెల్లింపులు చేశారో బయటికి చెప్పాలి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జీవిఎల్ కోరారు.

మొత్తంగా చంద్రబాబు హయాంలో పోలవరం, రాజధానిలో జరిగిన అవినీతిపై ప్రజా ప్రయోజనం కోసం విచారణ జరిపించాలని జీవిఎల్ ప్రభుత్వాన్ని కోరారు. జీవిఎల్ తాజా వ్యాఖ్యలు రాజధాని అంశంలో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఉన్నాయనడంలో సందేహం లేదు. పోలవరం, రాజధాని అంశంలో భారీగా అవినీతి జరిగిందన్న జీవిఎల్ వ్యాఖ్యలతో చంద్రబాబు ఇరుకునపడ్డారు. రాజధాని, పోలవరంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించేందుకు సిద్ధం అవుతున్న జగన్ సర్కార్‌కు జీవిఎల్ వ్యాఖ్యలు మరింతగా ఊతం ఇచ్చాయనే చెప్పాలి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat