Home / TELANGANA / మౌనం వీడిన మౌని..!!

మౌనం వీడిన మౌని..!!

ఎప్పుడా ఎప్పుడా అని తన అభిమానులు ఎదిరిచూస్తున్న రోజు రానే వచ్చింది. చిరునవ్వులు పూయించడంతోనే ఇన్నాల్లు సరిపెట్టుకున్నతాను తన వాగ్దాటితో జనంతోని కరతాళ ధ్వనులను మోయించిండు…సంతన్నగా తన అభిమానులు పిలుచుకునే రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్. భవనాన్ని నిలవెట్టే పునాది రాయి బైటికి కనిపించదు. కానీ కనిపించే సందర్భం వచ్చింది. అన్నస్పూర్తిని అందిపుచ్చుకోని తెరవెనకనుంచి మౌనంగా పనులు చక్కదిద్దే తండ్రిచాటు బిడ్డ పచ్చదనం కోసం పరితపించిండు. తెలంగాణకు హరితహారం చుట్టే ముఖ్యమంత్రి కెసిఆర్ మహాసంకల్పంలో తనవంతుగా ప్రక్రుతిమాతకు పచ్చలహారం తొడిగేందుకు ముందుకొచ్చిండు.

తెలంగాణ శివుని ఆశీస్సులు అందుకున్న సంతన్న కీసర గుట్ట శ్రీరామలింగేశ్వరుడు నెలిసిన పవిత్ర స్థలం నుంచి మొట్ట మొదటిసారి బహిరంగ సభలో తన హ్రుదయాన్ని ఆవిష్కరించిండు. అధినాయకుని మనసెరిగిన మౌని తన అంతరంగాన్ని విప్పిండు. సంతన్న అనగానె అందరికీ యాదికివచ్చేది ఆ చెరగని చిరునవ్వు. ఆ చెరగని చిరునవ్వు వెనక దాగిన ఇరువయేండ్ల సహనం సంయమనం వో యువకుని స్థితప్రజ్జత రాజకీయాలే కాదు ఏ రంగంలోనైనా ఎదగాలనుకునే నేటి యువతకు ఆదర్శం.
తోటి దోస్తులు ఎంజాయ్ చేసే నవయవ్వనంలో సంతోషాలను కాదనుకుని తెలంగాణ బాధలను అనుభవంలోకి తెచ్చుకున్నవాడు సంతన్న. చిందులు షికార్లతో ఎంజాయ్ చేయాల్సిన వయస్సును ఉద్యమానికి పెద్ద దిక్కయిన పెదనాయిన బాధల్లో పాలుపుంచుకున్నవాడు సంతన్న. తెలంగాణ ఉద్యమ రథసారధి తెలంగాణ ప్రజల ఆకాంక్షల వెంట నడిస్తే తాను రథసారధి మనసెరిగి మెదిలిండు. నాడు రామునివెంట నడిచిన లక్ష్మణుడి పాత్రను, రామున్ని సేవించిన హనుమంతుడి పాత్రని కెసిఆర్ కు తాను వొక్కడే పోశించిండు.

భగవంతునికీ భక్తునికీ నడుమ అనుసంధానకర్త గా పార్టీకార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అధినేత కెసిఆర్ నడుమ సమన్వయకర్తగా విరామమెరుగని పాత్రపోశించిండు.
కోరింది కావాలని ఆశపడే బిడ్డను లాలించే తల్లి మాదిరి కార్యకర్తల నాయకుల వేడి నిట్టూర్పులకు తన చెరగని చిరునవ్వు మలామ్ తో స్వాంతన పరిచిండు. పలకరింపులతో అనునయింపులతో నాడు పార్టీ కార్యకర్తలను ఎంప్టీగానే సమన్వయ పరిచిన సంతన్న నేడు ఎంపీగా ప్రభుత్వం తరఫున ఢిల్లీలో తన వంతు పాత్రపోశిస్తున్నడు. ఇన్నాల్లూ మౌనాన్ని చిరునవ్వులను మాత్రమే ఆస్వాదించిన తన అభిమానులు ఇకనుంచి సంతన్న హ్రుదయస్పందనను తెలుసుకునే సందర్భాన్ని కల్పించిండు. తెలంగాణ అధినాయకుడు సిఎం కెసిార్ అడుగుజాడల్లో నడుస్తూ తన ఆశయాలకు అద్దం పట్టే కార్యాచరణలో భాగస్వామ్యమౌతూ అన్న కెటిఆర్ కు కుడిభుజంగా రేపటి తెలంగాణ యువనాయకుడిగా సంతన్న ఎదగాలని మనసారా కోరుకుందాం…

– రమేష్ హాజరి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat