Home / HYDERBAAD / ఒకేసారి 250 కోట్ల పెట్టుబ‌డులు..!!

ఒకేసారి 250 కోట్ల పెట్టుబ‌డులు..!!

అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు కేంద్రంగా మారిన తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో మ‌రో ప్ర‌ముఖ ప‌రిశ్ర‌మ త‌న కార్యక‌లాపాలు ప్రారంభిస్తోంది. గుండెకు రక్తసరఫరా సాఫీగా సాగేందుకు అమర్చే స్టెంట్ల పరిశ్రమ హైదరాబాద్‌లో శివారులో ఏర్పాటవుతోంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్‌పార్కులో సహజానంద్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎస్‌ఎంటీ)యాజమాన్యం రూ.250 కోట్లతో నిర్మిస్తున్నది. ఆదివారం ఉదయం 9 గంటలకు పరిశ్రమ నిర్మాణానికి నిర్వహించే భూమిపూజకు మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి హాజరుకానున్నారు. 20 ఎకరాల్లో నిర్మించే ఈ పరిశ్రమ ఆసియాలోనే అతిపెద్దదని సహజానంద్ వైస్‌ప్రెసిడెంట్ రాజీవ్‌చిబ్బర్ తెలిపారు. ఏటా 1.25 మిలియన్ల స్టెంట్లు తయారుచేయాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని వివరించారు. పరిశ్రమ ఏర్పాటుతో 2,200 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

దేశంలో వైద్య పరికరాలను తయారుచేయడాన్ని ప్రొత్సహించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్, అప్పటి పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజ్‌పార్కును టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. ప్రభుత్వం సుల్తాన్‌పూర్‌లో 552 ఎకరాలను కేటాయించగా.. ఒక్క మెడికల్ డివైజ్‌పార్కుకు 271 ఎకరాలు కేటాయించారు. 2017లో అప్పటి పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మెడికల్ డివైజ్‌పార్కును ప్రారంభించారు. అదేరోజు 14 మంది పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల నిర్మాణం కోసం 60 ఎకరాల స్థలాన్ని కేటాయించి ధ్రువపత్రాలను అందజేశారు.తర్వాత మరో ఏడుగురు ముందుకొచ్చారు. ఇప్పటివరకు ఈ పార్క్‌లో 42 మంది పారిశ్రామిక వేత్తలకు, 32 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు, ఇతర పరిశ్రమల నిర్మాణానికి సంబంధించి 70 మందికి అనుమతులిచ్చారు. 12 పరిశ్రమల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నది. వీటిలో దక్కన్ ఎంటర్‌ప్రైజెస్, ఇంటర్నేషనల్ ఐఎస్‌సీ(యూష్ ప్యాన్స్), ప్రోమియో తెర్ఫాటెక్స్, ప్లెక్స్‌డ్‌టెక్నో పార్క్ పరిశ్రమలున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 12వేల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మౌలికవసతులు కల్పనకు ఇప్పటివరకు టీఎస్‌ఐఐసీ రూ.100 కోట్లకుపైగా వెచ్చించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat