Home / SLIDER / ఇదేందీ కార్పోరేట్ స్కూలా..

ఇదేందీ కార్పోరేట్ స్కూలా..

ఇదేందే కార్పోరేట్ పాఠశాల నా… !! ఇంత బాగుంది….. కాదే ఇది జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల నే… నో అడ్మిషన్లు అని బోర్డు పెట్టి..మంచి విద్యా బోధన అందించే రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది.. ఇదేం అనుకుంటూన్నారా ..సిద్దిపేట లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ నగర్ లో పర్యటిస్తున్న సందర్భంలో కారులో వెళ్తూ ఇందిరా నగర్ పాఠశాల ను చూసి హరిశ్ రావు గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ…

ఇదే క్రమంలో లోపలి వెళ్లి చూద్దాం రావే అని హరిశ్ రావు గారు , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు స్కూల్ ని ” అనుకోకుండా… అలా… ఆకస్మికంగా ” వెళ్లారు..అదే సమయంలో విద్యార్థులకు ఉదయం ప్రార్థన ముందు జరిగే ” ప్రవర్తన లో మార్పు ” అనే అంశం పై జరుగుతున్న సందర్భంలో విద్యార్థుల తో కాసేపు చిట్ చాట్ చేశారు… వారి విద్యాభ్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు.. విద్యార్థుల్లో ఉత్సాహన్ని నింపారు..

గుడ్ స్టడీ…! గుడ్ బిహేవియర్…! గుడ్ సొసైటీ…!! అని వారితో చెప్పారు.. విద్యార్థుల్లో మార్పు దిశగా ప్రతి రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనియం అని పాఠశాల ఉపాధ్యాయులను హరిశ్ రావు గారు అభినందించారు… ఈ పాఠశాల ఆదర్శంగా ఉంది..అని ఒక కార్పోరేట్ పాఠశాలకు వచ్చామా అన్నట్టు ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు… అనుకోకుండా వచ్చిన అతిథులను చూసి ఉపాధ్యాయులు ఆశ్చర్యం పోయారు… విద్యార్థులు ఆనందం తో ఉప్పొంగి పోయారు…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat