Home / MOVIES / హెబ్బా పటేల్ కొత్త సినిమాలో ..చాలా చాలా హాట్

హెబ్బా పటేల్ కొత్త సినిమాలో ..చాలా చాలా హాట్

హెబ్బా పటేల్… ‘కుమారి 21 ఎఫ్‌’ చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. దీంతో యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో ఆ వెంట‌నే చాలా ఆఫర్స్ హెబ్బాను వెతుక్కుంటూ వ‌చ్చాయి.ఆ తరువాత ఆ స్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. అందాలు ఒలకబోయడానికి ప్రయత్నించినా, ఎంచుకున్న కథల్లో విషయం లేకపోవడం వలన వెనుకబడిపోయింది. తాజాగా ఆమె మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అయితే ఈ సారి ఆమె ఓకే చెప్పింది హీరోయిన్ రోల్ కోసం కాదు .. విలన్ పాత్ర కోసం. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘భీష్మ’ రూపొందుతోంది. ఈ సినిమాలో నితిన్ సరసన నాయికగా రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కీలకంగా వుంటుందట. ఈ పాత్రలో హెబ్బా పటేల్ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదిస్తే వెంటనే ఓకే చెప్పేసిందట. అంతేకాదు చిత్రంలో కొన్ని సీన్స్ లో హెబ్బా, రష్మికల నడుమ హీరో నితిన్ నలిగిపోతాడని అంటున్నారు. అలాగే ఆమెతో ఓ సాంగ్ సైతం ఉందని, అది చాలా హాట్ గా ఉంటుందని చెప్తున్నారు. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్రలో హెబ్బా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat