Home / UPDATES / రోజుకో పెగ్ వైన్, వారానికో బీరు ఆరోగ్యానికి మంచిదనుకుంటున్నారా…అయితే ఈ వార్త చదవండి..!

రోజుకో పెగ్ వైన్, వారానికో బీరు ఆరోగ్యానికి మంచిదనుకుంటున్నారా…అయితే ఈ వార్త చదవండి..!

మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కొంత మంది డైలీ రెండు నుంచి నాలుగైదు బీర్లు, లేకుంటే..ఓ ఫుల్ బాటిల్ విస్కీ, వైన్, లేదా రమ్..పుచ్చుకుంటారు. మరి కొంత మంది మాత్రం గుండెకు మంచిదంటూ.. రోజుకో పెగ్ వైన్ లేదా వారానికో బీర్ తాగుతారు… ఇలా చేస్తే అందరు మందుబాబుల్లాగా ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుందని వీళ్లు భావిస్తారు. గతంలో కూడా పలు అధ్యయనాలు డైలీ అధిక మోతాదులో మద్యం తాగకుండా… రోజుకో పెగ్ వైన్, వారానికో బీరు మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని తెలియజేశాయి. అయితే ఇది కేవలం అపోహే అంటున్నారు సైంటిస్టులు. ఇలా డైలీ లిమిట్‌గా వైన్ లేదా విస్కీ, బీరు తీసుకునేవాళ్లకు ఇటీవల వెల్లడైన ఓ తాజా అధ్యయనం షాక్ ఇస్తోంది. వారానికి కేవలం 100 గ్రాములు అంటే దాదాపు ఐదు గ్లాసుల వైన్‌, 9 గ్లాస్‌ల బీర్‌ను పుచ్చుకున్నా అకాల మరణం తప్పదని మెడికల్‌ జర్నల్‌ ది లాన్సెట్‌ ప్రకటించింది. 19 దేశాల్లోని ఆరు లక్షల మంది లిక్కర్ ప్రియులను పరిశీలించిన పిమ్మట ఈ పరిశోధన వివరాలు వెల్లడయ్యాయి.

ఇక వారానికి 200 గ్రాముల నుంచి 350 గ్రాములు అంటే వారానికి 10 నుంచి 18 గ్లాసుల వరకూ వైన్‌, 20 నుంచి 40 గ్లాసుల వరకూ బీరును తీసుకునేవారు తమ సగటు జీవిత కాలంలో రెండేళ్లకు ముందే మరణిస్తారని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మద్యం సేవించడంపై ఉన్న అధికారిక గైడ్‌లైన్స్‌ను సవరించాల్సిన అవసరం ఉందని ది లాన్సెట్‌ స్పష్టం చేసింది. ఇక నుంచి ప్రతివారం ఆరు గ్లాస్‌ల వైన్‌, అదే మోతాదులో బీర్‌ను తీసుకోవాలని, అంతకు మించి మద్యం సేవిస్తే చావుకు దగ్గర అయినట్లే అని ఇటీవల బ్రిటన్ కూడా ప్రకటించింది. సో..చూశారుగా…లిమిట్‌గా తాగుతున్నాం…హెల్తీగా ఉంటున్నామంటూ కాలరెగరేసే మందుబాబులు…ఓ సారి ఆలోచించండి…వారానికి 5 పెగ్‌లు వైన్, 9 గ్లాసుల బీర్ తాగినా…తొందరగా పైకి పోయే ఛాన్స్ ఉంది… లిమిట్ లిమిట్ అంటూ లిక్కర్ తాగితే…మీ లైఫ్ అవుట్ అవుతుంది..కాబట్టి జాగ్రత్త పడండి…కలకాలం బతకాలంటే మద్యం అలవాటను మానుకోండి. ఓకేనా..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat