Home / ANDHRAPRADESH / సీఎ జగన్‌పై సీబీఐ మాజీ జేడీ సంచలన వ్యాఖ్యలు…!

సీఎ జగన్‌పై సీబీఐ మాజీ జేడీ సంచలన వ్యాఖ్యలు…!

ఏపీ సీఎం జగన్  పాలనపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ప్రశంసలు కురిపించాడు…యుపీఏ హయాంలో సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలతో జగన్‌పై సీబీఐ అక్రమాస్థుల కేసుల్లో ఇరికించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీబీఐ జేడీగా లక్ష్మీ నారాయణ అత్యుత్సాహం ప్రదర్శించాడు. జగన్‌‌పై కేసులు బనాయించి, 16 నెలలు జైల్లో పెట్టించడంలో లక్ష్మీనారాయణ కీలక పాత్ర పోషించాడు. అప్పట్లో ఈయనను నీతి, నిజాయితీకి ప్రతిరూపంగా టీడీపీ శ్రేణులు, ఎల్లోమీడియా ఆకాశానికి ఎత్తేసింది. జగన్‌పై బనాయించిన కేసుల్లో సీబీఐ అధికారిగా లక్ష్మీనారాయణ పరిధులు దాటి వ్యవహరించడం వివాదస్పదంగా మారింది. జగన్ కేసులకు సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు ఎల్లోమీడియాకు అందించాడంటూ…మాజీ జేడీపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఎల్లోమీడియా ఛానళ్లు లక్ష్మీ నారాయణను హీరోగా కీర్తించేవి. అయితే సీబీఐ నుంచి బదిలీ అయి కొంత కాలం పూనేలో పని చేసిన లక్ష్మీ నారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తొలుత తనకు క్లీన్ ఇమేజ్ ఉందని భావించిన ఈ సీబీఐ మాజీ జేడీ సొంతంగా పార్టీ పెడదామని భావించాడు కానీ..అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత బీజేపీలో చేరుతాడని అందరూ భావించినా..జనసేన పార్టీలో చేరి…వైజాగ్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలైన తర్వాత లక్ష్మీ నారాయణ జనసేన పార్టీలో క్రియాశీలకంగా కనిపించడం లేదు. అయితే స్వారత్రిక ఎన్నికలకు ముందు జగన్‌పై టీడీపీ నేతలు చేసే లక్ష కోట్ల ఆరోపణలను లక్ష్మీ నారాయణ కొట్టి పారేశాడు. లక్ష కోట్లు అనేది అబద్ధమని..చార్జిషీట్‌లో పేర్కొంది కేవలం 1400 ల కోట్లు మాత్రమే అని స్పష్టం చేశాడు. దీంతో జగన్‌పై లక్ష కోట్ల ఆరోపణలకు స్వయంగా లక్ష్మీ నారాయణ చెక్ పెట్టినట్లయింది.

తాజాగా ఈ సీబీఐ మాజీ జేడీ జగన్‌పై ప్రశంసలు కురిపించారు…వివరాల్లోకి వెళితే..2019 సార్వత్రిక ఎన్నికల ముందు ఏడాది పాటు సాగిన ప్రజా సంకల్పయాత్రలో నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్ నవరత్నాలలో భాగంగా దశలవారీగా సంపూర్ణ మద్యపానం అమలు చేస్తామని, మద్యం రక్కసికి బలైపోతున్న కుటుంబాల్లోని ఆడబిడ్డల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాడు. ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యలు చేపట్టగానే దశలవారీగా మద్యపానం నిషేధం దిశగా జగన్ చర్యలు తీసుకుంటున్నాడు. తొలి విడుతలో బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయించారు. ప్రైవేట్ మద్యం లెసెన్సులు బంద్ చేశారు. మద్యం దుకాణాలను పూర్తిగా తగ్గించారు. రాష్ట్రానికి రెవిన్యూ రాకపోయినా..జగన్ ధైర్యంగా మద్యనిషేధంపై ముందడుగు వేస్తున్నాడు. కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యాన్ని అందుబాటులో ఉంచి..ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను సృష్టించేందుకు సీఎం జగన్ నూతన మద్యం పాలసీపై కసరత్తు చేస్తున్నారు.. అయితే మద్యనిషేధం సాధ్యం కాదని…టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తదితర నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే జనసేన పార్టీలో కీలక నేత అయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మాత్రం…ఏపీ మద్యం పాలసీపై ప్రశంసలు కురిపించాడు. మద్యపాన నిషేధం దిశగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయం సమాజానికి మేలు కలిగిస్తుంది. దశలవారీగా మద్యనిషేధం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి…జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కచ్చితంగా ఫలితాలు ఇస్తాయంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక పక్క జనపార్టీ అధినేత పవన్ దశలవారీ మద్యనిషేధంపై విమర్శలు గుప్పిస్తే..ఆ పార్టీలో కీలక నేత అయిన లక్ష్మీనారాయణ మాత్రం సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించడం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. జేడీ ప్రశంసలపై వైసీపీ శ్రేణులు భారీగా స్పందిస్తున్నారు. ఎవరి చేత అక్రమంగా కేసుల్లో ఇరికించబడి జైలుకు పాలయ్యాడో…అతడి చేత పొగిండించుకోవడం ఒక్క జగన్‌కే సాధ్యమైంది..దటీజ్ జగన్ అంటూ వైసీపీ అభిమానులు కాలరెగరేస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat