Home / 18+ / తిరుమల కొండపై చర్చి ఉందంటూ దుష్ప్రచారం చేసిన వ్యక్తులు అరెస్ట్..!

తిరుమల కొండపై చర్చి ఉందంటూ దుష్ప్రచారం చేసిన వ్యక్తులు అరెస్ట్..!

భారతదేశంలో తమ మతాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తూ ఇతర మతాలను గౌరవంగా చూసే వారే అధిక. నూటికో కోటికో ఎవరో కొందరు ఇతర మతాలపై విషం కక్కుతారే గాని 99.99% భారతీయులు అందరు దేశ సంస్కృతికి , ఔనత్యానికి , ఘనమైన సంప్రదాయాలకు , దేశ నాగరికతకు గౌరవం ఇస్తూనే ఉంటారు. అందుకే భారతదేశంతో పాటు స్వాత్రంత్యం సాదించిన మిగతా దేశాలకంటే అన్నిరంగాల్లో మనదేశం ముందుకు వెళ్తుంది. ఇలాంటి ఘనమైన సంప్రదాయాలను పాటించే దేశంలో వాటికీ చెదలు పట్టించే పెద్ద ఘనకార్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో కలియుగ ప్రత్యక్ష దైవం వెలసిన తిరుమలలో జరగడం దుమారానికి తెరలేపింది.

 

తాజాగా తిరుమల కొండపై చర్చి వుందని అసత్య ప్రచారం చేస్తూ వక్రీకరించిన ఫొటోలలతో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వ్యక్తులను తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పి అన్బురాజన్ తెలిపారు. హైదరాబాదుకు చెందిన అరుణ్, కార్తీక్ లు, గుంటూరుకు చెందిన అజిత్ సాయి లు తిరుమల కొండల్లో చర్చి వుందని చూపుతూ అడవిలో ఓ సెల్ టవర్ బిల్డింగును దానిపైన వున్న సిలువ పోటో అంటూ ఆ టవర్ పైన కెమెరాను అమర్చే ఇనప కమ్మిని ఫొటో తీసి సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసారన్నారు. ఈ పోస్ట్ లు చేసిన వీరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇది కచ్చితంగా భారతదేశ లౌకికవాదంపై దాడి అని వీరిపై రాజ్యద్రోహం కేసు పెట్టాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat