Home / CRIME / రాజధాని రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

రాజధాని రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం 8లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. కాగా స్టేషన్‌లో నిలిచి ఉన్న ఛండీఘడ్‌-కొచువెల్లి ఎక్స్‌ప్రెస్‌ బోగీల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ నుంచి ప్రయాణికులను అక్కడ నుంచి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సింది.