Home / MOVIES / ఇండస్ట్రీని వదిలేసి.. బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో ఉన్నారని అన్నావ్‌గా.. పెళ్లి చేసుకో..పునర్నవి

ఇండస్ట్రీని వదిలేసి.. బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో ఉన్నారని అన్నావ్‌గా.. పెళ్లి చేసుకో..పునర్నవి

దొంగలు దోచిన నగరం టాస్క్‌ మొదటి లెవల్లో ఎంత హిస్మాతకంగా మారిందో అంతకన్నా దారుణంగా రెండో లెవల్‌ కొనసాగిన సంగతి తెలిసిందే. దీంతో బిగ్‌బాస్‌ ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయకపోవడంతో టాస్క్‌ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. హింసకు కారణమయిన వ్యక్తిని ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్‌బాస్‌ సూచించారు. కెప్టెన్‌ వరుణ్‌ కలసి రాహుల్‌, రవి పేర్లను అందరూ కలిసి ఏకాభిప్రాయంతో బిగ్‌బాస్‌కు సూచించారు. దీంతో వారిద్దర్నీ జైల్లో బంధించాల్సిందిగా ఆదేశించాడు. జైల్లో ఉన్న రాహుల్‌ వద్దకు పునర్నవి వచ్చి ముచ్చట్లు పెట్టింది. దీంట్లో భాగంగా వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంది.

తనకు ఇంకా చదువుకోవాలని ఉందని, ఇది కాకపోతే తాను ఎలాగైనా బతకగలనని.. ఎందుకంటే తనకు డిగ్రీ ఉందని ఏదైనా ఉద్యోగం చేసుకుని బతకగలనని రాహుల్‌తో చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. తనకు ఆప్షన్స్‌ అంటే చాలా ఇష్టమని, అలా ఉంటే తనేప్పుడు ఎవరికీ తలొంచకుండా ఉండగలనని చెప్పుకొచ్చింది. అలానే ఉంటది ఇక్కడ.. తాను ఓ తెలుగు అమ్మాయిని అంటూ క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించే పునర్నవి మాట్లాడినట్లు అనిపిస్తోంది.

దీనికి బదులుగా రాహుల్‌.. ఇండస్ట్రీని వదిలేసి.. బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో ఉన్నారని అన్నావ్‌గా.. పెళ్లి చేసుకో.. సెటిల్‌ అయిపో.. అంటూ సలహా ఇచ్చాడు. తనకు ఇంకో రెండేళ్లు చదువుకోవాలని ఉందంటూ రాహుల్‌తో చెప్పుకొచ్చింది. ఇలా రాత్రంతా మాట్లాడుకుంటూ ఉన్న ఈ జంటకు.. ఉదయాన్నే ఓ గొడవ జరిగింది. పడుకుని ఉన్న రాహుల్‌ను లేపేందుకు ప్రయత్నించింది పునర్నవి. పిచ్చిది అలానే చేస్తది అని పునర్నవి గురించి రాహుల్‌.. రవితో అనేసరికి ఆమె ఫీల్‌ అయింది. అక్కడి నుంచి వెళ్లి కన్నీరుపెట్టుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat