Home / ANDHRAPRADESH / అనంతలో అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి మృతి..!

అనంతలో అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి మృతి..!

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు కరెంట్‌ షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. వజ్రకరూరు మండలం పొట్టిపాడులో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పొట్టిపాడుకు చెందిన చంద్ర, ఈరన్న అనే ఇద్దరు అన్నదమ్ములు శుక్రవారం ఉదయం హంద్రీనీవా కెనాల్‌నుంచి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారు. ఇందుకోసం మోటారు మరమ్మత్తులు చేస్తుండగా కరెంట్‌ షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా విలపించారు. అన్నదమ్మల మృతితో పొట్టిపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.