Home / ANDHRAPRADESH / యధావిధిగా దుష్ప్రచారం చేసి ఫేక్ ఫొటోలతో దొరికిపోయిన టీడీపీ

యధావిధిగా దుష్ప్రచారం చేసి ఫేక్ ఫొటోలతో దొరికిపోయిన టీడీపీ

ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రేషన్ డోర్ డెలివరీ తో కొండ ప్రాంతాల్లో జీవిస్తున్న వారికి కూడా రేషన్‌ బియ్యం సక్రమంగా అందుతున్నాయి.. గతంలో ఇలా అందేవి కావు. లబ్ధిదారులందరి ఇళ్లకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా శుక్రవారం నుండి ఈకార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 8,60,727 తెల్ల రేషన్‌ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్‌లను పంపిణీ చేశారు. ఇందుకు 6వేల వాహనాలను వినియోగించారు.

జిల్లాలో నాణ్యమైన బియ్యం పంపిణీ సక్సెస్:
మొత్తం 9.36 లక్షల సంచుల్లో కేవలం 30 సంచులు బియ్యంపైనే ఫిర్యాదులు వచ్చాయి.. వాటి స్థానంలో వేరే బియ్యం సంచులు అందించారు. గత నాలుగురోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా 30కి పైగా బియ్యం బ్యాగులు తడిసిపోయాయి. వాటిలో బియ్యం ఉండలు కట్టడంతో ఆ విషయాన్ని వలంటీర్లకు తెలియజేయడంతో వాటి స్థానంలో కొత్త బ్యాగ్‌లను పంపిణీ చేశారు. బియ్యం పంపిణీపై ఉందన్న లబ్ధిదారుల అభిప్రాయాల్ని వలంటీర్లు తీసుకున్నారు. బియ్యం చాలా బాగున్నాయనే అభినందనలు వచ్చాయని పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలినాని తెలిపారు. పేదవారు తినగలిగే బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని నాని విమర్శించారు. మరోవైపు ఎత్తైన కొండప్రాంతాల్లో నివాసం ఉంటున్న తమఇళ్లకే బియ్యం తెచ్చి ఇస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి గ్రామానికి చెందిన పలువురు మహిళలు హర్షం వ్యక్తంచేశారు. బియ్యంకోసం 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేదని చెప్తున్నారు. అయితే ప్రజాస్పందన ఇంత అద్భుతంగా ఉంటే టీడీపీ శ్రేణులు మాత్రం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఫేక్ ఫొటోలతో చంద్రబాబు హయాంలో పంపిణీ చేసిన బియ్యాన్ని చూపిస్తూ జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat