Home / NATIONAL / ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలాని కన్నుమూత..!

ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలాని కన్నుమూత..!

ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్రమంత్రి రామ్ జఠ్మలాని కన్నుమూసారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలోనే కన్నుమూసారు. ఆయన గతంలో కేంద్రమంత్రిగా, బార్ కౌన్సిల్ చైర్మన్ గా చేసారు. ఎన్నో కీలక కేసులు ఆయన హ్యాండిల్ చేసారు. అప్పట్లో జైట్లీ, కేజ్రీవాల్ కేసులో ఈయన కేజ్రీవాల్ తరపున వాదించారు. వాజ్పేయీ సమయంలో కేంద్రమంత్రిగా పనిచేసారు. ఈయన సెప్టెంబర్ 14, 1923 లో జన్మించారు. జఠ్మలాని కి ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు.