ఆమె వయస్సు అక్షరాల 19ఏళ్లు. కానీ ఆమె చేసిన పనికి యావత్తు ప్రపంచమంతా అవాక్కైపోతున్నారు. పంతొమ్మిదేళ్లకే టెన్నిస్ దిగ్గజాన్ని మట్టికరిపించి అందరిచేత వహ్వా అన్పించుకుంది. కెనాడాకు చెందిన ఈ అందాల టెన్నిస్ ప్లేయర్ బియాంకా ఆండ్రిస్కూ టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ను ఓడించి తమ దేశం తరపున టైటిల్ ను గెలుచుకుంది.
అయితే ఏ మాత్రం గర్వం లేదు. ఇంత పెద్ద ట్రోపిని గెలిస్తే ఎవరైన సరే ఎగిరి ఎగిరి గంతులేస్తారు. ఎంతో ఉద్వేగానికి లోనవుతారు. కానీ వీటిన్నిటికి ఈ అందాల ప్లేయర్ ఫుల్ స్టాప్ పెట్టి నేరుగా సెరెనా విలియమ్స్ దగ్గరకు వచ్చి కరాచలనం చేసి అభిమానులకు అభివాదం చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ట్రోపిని అందుకుని ముద్దాడింది.
దీంతో ఆండ్రిస్కూను ఆ అమ్మాయి అంతే అని ప్రశంసలు కురిపిస్తున్నారు. సెరెనాతో జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో అండ్రిస్కూ 6-3,7-5తో సెరానాను ఓడించి ట్రోపిని సొంతం చేసుకుంది. పంతొమ్మిదేళ్లకు యూఎస్ ఓపెన్ ఛాంప్ ట్రోపిని సొంతం చేసుకోవడంతో అందరూ అవాక్కైపోతున్నారు.