Home / SLIDER / ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు

ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్‌ చదివి వినిపిస్తున్నారు.

మార్చిలో ఆరు నెలల కాలానికి చట్టసభల ఆమోదం పొందిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో.. అక్టోబర్‌ నుంచి మార్చి నెలాఖరు వరకు ప్రతిపాదించిన పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

నిన్న రాత్రి జరిగిన కేబినెట్‌ సమావేశంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన విషయం విదితమే.

-రూ. 1,46,492.3 కోట్లతో రాష్ర్ట బడ్జెట్
-రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు
-మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు
-బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు
-రాష్ర్ట ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు

-రైతుబంధు పథకానికి రూ. 12 వేల కోట్లు కేటాయింపు.
-రైతుబీమా ప్రీమియం చెల్లింపుకు రూ. 1,137 కోట్లు కేటాయింపు.
-ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు కేటాయింపు.
-అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో రూ. 5,37,373 కోట్లు ఖర్చు.
-కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందినవి కేవలం రూ. 31,802 కోట్లు మాత్రమే.

-ఆర్థిక మాంద్యం వల్ల ఆదాయం తగ్గింది.
-ఆదాయం తగ్గినా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం.
-వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన.
-రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరుగుతుందని అంచనా.
-అన్ని శాఖల్లో ఉన్న బకాయిలు తక్షణమే చెల్లింపు.
-బకాయిల చెల్లింపునకు బడ్జెట్ లో తగిన కేటాయింపులు.
-బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని విధాన నిర్ణయం.
-పరిమితులకు లోబడి ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం నిధుల ఖర్చు.
-నిధుల ఖర్చుపై మంత్రులు, కార్యదర్శులకు ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన సూచనలు.
-రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం ఇప్పటి వరకు రూ. 20,925 కోట్లు.
-ఉదయ్ పథకం ద్వారా రుణభారం రూ. 9,695 కోట్లు ప్రభుత్వమే భరించింది.
-విద్యుత్ సంస్థలకు సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,772 కోట్లు ప్రభుత్వమే చెల్లించింది.

-తెలంగాణకు జీఎస్టీ పరిహారం తీసుకోవాల్సిన అవసరం రాలేదు.
-జులై నెలలో తీసుకున్న జీఎస్టీ పరిహారం ఏప్రిల్, మే నెల కంటే 4 రెట్లు ఎక్కువ.
-గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ అంచనాలకు నేటికి చాలా వ్యత్యాసముంది.
-కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 1.36 శాతం మాత్రమే వృద్ధి సాధ్యమైంది.

-దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గింది.
-వాహనాల అమ్మకాలు 10.65 శాతం తగ్గాయి.
-రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది.
-దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం తెలంగాణపై కూడా పడింది.

-ఐటీ రంగంలో 2018-19 నాటికి 11.05 శాతం వృద్ధి రేటు సాధించాం.
-2018-19 నాటికి లక్షా 10 వేల కోట్ల ఐటీ ఎగుమతులు.
-మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించాం.
-వందలాది గురుకులాల్లో లక్షలాది మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందుతోంది.
-భీకరమైన జీవన విధ్వంసం నుంచి తెలంగాణ కుదుట పడింది.
-తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది.

-6.3 శాతం అదనపు వద్ధి రేటు సాధించాం.
-వ్యవసాయ రంగంలో 2018-19 నాటికి 8.1 శాతం వృద్ధిరేటు నమోదు చేశాం.

-ఐదేళ్లలో రాష్ర్ట స్థూల జాతీయోత్పత్తి రెట్టింపు అయింది.
-వివిధ ఆర్థిక సంస్థలిచ్చిన నిధులను మూలధన వ్యయంగా ఖర్చు చేశాం.
-నిధులు ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉంది.
-ఐదేళ్లలో పెట్టుబడి వ్యయం ఆరు రెట్లు పెరిగింది.

-దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది.
-ఐదేళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించాం.
-వినూత్నమైన పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది.
-తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దృఢంగా మారింది.
-2013-14లో జీఎస్‌డీపీ విలువ రూ. 4,51,581 కోట్లు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat