Home / UPDATES / ఫ్రెంచ్ కిస్‌తో ఎన్ని రోగాలు వస్తాయో తెలిస్తే.. జన్మలో మీ పార్టనర్‌కు ముద్దు పెట్టరు…?

ఫ్రెంచ్ కిస్‌తో ఎన్ని రోగాలు వస్తాయో తెలిస్తే.. జన్మలో మీ పార్టనర్‌కు ముద్దు పెట్టరు…?

ఫ్రెంచ్‌కిస్…స్త్రీ, పురుషుల మధ్య ఉన్న ప్రేమ గాఢతను తెలిపే..ముద్దు. భార్యభర్తలు, ప్రేమికులు.. ఒకరిపెదాలు మరొకరు జుర్రుకుంటూ, ఒకరి నాలికను మరొకరు చప్పరిస్తూ.. ఫ్రెంచ్‌కిస్‌తో అంతులేని ఆనందాన్ని పొందుతారు. ముద్దుల్లోనే ప్రత్యేకమైన ఈ ఫ్రెంచ్‌కిస్‌ను లాగించని వారు ఉండరూ..అయితే ఈ ఫ్రెంచ్‌ కిస్‌తో అనారోగ్యానికి ముప్పు అని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా గనేరియా వంటి సుఖవ్యాధులు ఈ ఫ్రెంచ్‌ కిస్‌ వల్ల వస్తుందని ఆస్ట్రేలియాలోని మోనాష్‌ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం ప్రతి ఏడాది 78 మిలియన్ల మందికి గనేరియా సంక్రమిస్తుంది. ఈ గనేరియా అనేది సుఖవ్యాధి..అనైతిక లైంగిక సంబంధాల వల్ల ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అయితే ఫ్రెంచ్‌ కిస్‌ల వల్ల గనేరియా వంటి సుఖవ్యాధితో పాటు మొత్తం ఐదు వ్యాధులు వస్తాయని పరిశోధకులు అంటున్నారు. కొన్ని నెలలుగా లైంగిక చర్యలో పాల్గొనని వ్యక్తులపై పరిశోధన నిర్వహించిన మోనాష్ సైంటిస్టులు.. వారికి గనేరియా వ్యాధి రావడంతో…అది కేవలం ఫ్రెంచ్ కిస్ వల్ల సంక్రమించిందని గుర్తించారు. ఈ గనేరియా వ్యాధి సోకడం వల్ల గొంతు, రక్తంపై కూడా ప్రభావం చూపి మరో ఐదు వ్యాధులకు కారణం అవుతోంది. ఈ అంశంపై మోనాష్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ కిట్ ఫెయిర్లీ స్పందించారు. ‘గనేరియా అనే వ్యాధి వేగంగా విస్తరిస్తుందన్న విషయం గమనించాలి. ఇది ఎలా సంక్రమిస్తుందో తెలుసుకోవడంతోపాటు దీన్ని ఎలా నియంత్రించాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఫ్రెంచ్‌ కిస్ ముద్దు వలన కూడా ఈ ప్రమాదకర అంటువ్యాధి వ్యాప్తి చెందుతుందని అవగాహన కలిగించాలి. దాని నివారణకు యాంటీ బ్యాక్టీరియల్‌ మౌత్‌‌వాష్‌ వంటి కొత్త నియంత్రణ పద్ధతులను అనుసరించాలి’ అని తెలిపారు. చూశారుగా…అపరిచితులతో శృంగారమే కాదు..పార్టనర్లతో ఫ్రెంచ్ కిస్‌‌ చేస్తే గనేరియా వంటి సుఖవ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి..ఎవరైనా సరే ముద్దు విషయంలో జాగ్రత్త పడడం బెటర్..మరీ ముద్దు పెట్టుకోకుండా ఉండలేని వారు…యాంటీ బ్యాక్టీరియల్ మౌత్‌వాష్ వంటివి వాడితే…మంచిది. మాంచి రొమాంటిక్ మూడ్‌లో పార్టనర్‌తో లిప్‌లాక్ చేయాలని చూస్తే..లైఫే లాక్ అయిపోయే అవకాశం ఉంది..కాబట్టి బీ కేర్‌ఫుల్..ఓకేనా.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat