ఆయన టీమిండియా చీఫ్ కోచ్. అతన్ని ఇష్టపడి కోరి మరి టీమిండియా కోచ్ గా ఎంచుకున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లి. అయితే తాజాగా ఆయన వార్షిక వేతనం ఎంతో తెలుసా..?.
ఆయన వేతనం దాదాపు 20% వరకు పెరిగిందని సమాచారం. రవితో పాటు సహాయ సిబ్బంది వేతనాలు కూడా పెరిగాయని టాక్. గతేడాది వరకు శాస్త్రికి బీసీసీఐ ఏడాదికి రూ.8 కోట్లు.
అయితే ప్రపంచకప్ తో అతడి పదవీకాలం ముగియడంతో వెస్టిండిస్ సిరీస్ కోసం నలబై ఐదు రోజులు గడవు పొడిగించారు. అయితే తాజాగా పెరిగిన వార్షిక వేతనం రూ.9.5కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు పొందే అవకాశం ఉంది.
బౌలింగ్ కోచ్ గా ఎంపికైన భరత్ అరుణ్,ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కు సైతం వేతనాల్లో పెంపడంతో ఏడాదికి రూ.3.5కోట్లు పొందుతారు. విక్రమ్ రాఠోడ్ కి రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పొందుతారు.