Home / TELANGANA / తెలంగాణ కంచి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..!

తెలంగాణ కంచి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..!

ఎవరికైనా బల్లిదోషం పోవాలంటే కంచికి వెళ్లాలంటారు..కానీ దూరభారంతో వెళ్లలేని వారు..తెలంగాణలోని ఓ గుడికి వెళితే బల్లిదోషం తొలగి, కంచికి వెళ్లినంత పుణ్యం వస్తుంది. పూర్తిగా కంచిని తలపించే ఈ గుడి పేరేంటి..ఎక్కడ ఉంది అంటారా…సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో… చుట్టూ పచ్చని పంట పొలాలు, పక్కనే కోనేరుతో.. ఆహ్లాదకర వాతావరణంలో ఓ గుట్టపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా కొలువై ఉన్న శ్రీ ఆదినారాయణస్వామి భక్తులను కరుణిస్తున్నాడు. ఈ కొడకంచి గ్రామం తెలంగాణ కంచిగా పేరుగాంచింది. సుమారు 900 ఏళ్ల క్రితం శ్రీ మహావిష్ణువు … శ్రీదేవీ, భూదేవీ సమేతంగా ఆదినారాయణ స్వామి ఈ కొడకంచి గుట్టపై వెలిశాడని ప్రతీతి.

ఆలయ చరిత్ర గురించి తెలుసుకుంటే..సుమారు 900 ఏళ్ల క్రితం అల్లాణి వంశస్థుడైన రామోజీరావుకు స్వయంగా ఆదినారాయణస్వామి కలలోకి వస్తాడు. మంబాపూర్‌ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని స్వామివారు ఆదేశించారు. దీంతో మరుసటి రోజు అల్లాణి వంశస్థులతో పాటు గ్రామ ప్రజలందరూ కలసి స్వామివారి విగ్రహం కోసం అటవీ ప్రాంతంలో వెతుకుతారు. కాని స్వామి వారి విగ్రహం దొరకలేదు. అయితే స్వామి వారు మరోసారి అల్లాణి వారి కలలోకి వచ్చి తెల్లవారే లోపు మీ ఇంటిముందు గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడపక్షే మిమ్మల్ని తానున్న స్థానానికి తీసుకువెళ్తుందని, తన విగ్రహాన్ని కొడకంచి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గల ఓ గుట్టపై ప్రతిష్టించాలని చెప్పి అంతర్ధానం అవుతారు. తెల్లారే సరికి అల్లాణి వారి ఇంటి ముందు గరుడపక్షి చూసి గ్రామస్థులంతా ఆశ్చర్యపోతారు. వెంటనే ఆ గరుడపక్షి చూపిన దారిలో అటవీ ప్రాంతంలోకి వెళ్లిన అల్లాణి వంశస్థులకు స్వామివారి విగ్రహం లభించింది. వారు స్వామివారు కలలో చెప్పిన విధంగా ఈ విగ్రహాన్ని కొడకంచిలోని ఓ గుట్టపై ప్రతిష్టించారు. అప్పటినుంచి నేటి వరకు కంచిలో స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడి స్వామివారికి కూడా అలాగే పూజలు నిర్వహిస్తున్నారు.

కంచిలో ఏ విధంగా పూజలు, అర్చనలు నిర్వహిస్తారో…కొడకంచిలో ఉన్న ఈ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయంలో కూడా అలాగే నిర్వహిస్తారు. వాస్తవానికి దేశం మొత్తం మీద కంచి తర్వాత బంగారు, వెండి బల్లులు ఉన్న ఆలయం..ఈ కొడకంచి ఆదినారాయణస్వామి ఆలయం మాత్రమే. అందుకే ఈ ఆలయం తెలంగాణ కంచిగా తన ప్రత్యేకతను సంతరించుకుంది. బల్లిదోషం ఉన్నవారు కంచికి వెళ్లలేకపోయినా కొడకంచికి వెళ్లి ఇక్కడి ఆలయ ఆవరణలో ఉన్న కొలనులో స్నానం చేసి, దేవాలయంలోని వెండి, బంగారు బల్లులను స్పర్శిస్తే, బల్లి దోషం తొలగి..కంచికి వెళ్లినంత పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తుంటారు. అందుకే ‘కంచికి వెళ్లలేకున్నా కొడకంచికి వెళ్లాలనే’ నానుడి వచ్చింది. అప్పట్లో బంగారు, వెండిబల్లులు ఉన్న ఈ గ్రామం కడకంచిగా విరాజిల్లింది. అయితే రానురాను కడకంచి కాస్తా కొడకంచిగా మారింది. ఈ ఆలయంలో ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక ఈ ఆదినారాయణ స్వామి దేవాలయ ఆవరణలో ఆంజనేయ స్వామి దేవాయం, శివాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వంద ఏళ్ల కింద తయారు చేయించిన స్వామివారి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొడకంచికి సికింద్రాబాద్, సంగారెడ్డి, మెదక్‌ల నుంచి బస్సు సౌకర్యం కలదు. సికింద్రాబాద్‌ పరిధిలోని బాలానగర్‌ నుంచి బొంతపల్లి కమాన్‌ వరకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి. బొంతపల్లి కమాన్‌ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరం గల కొడకంచికి బస్సులో వెళ్లిలా. ఇక పటాన్‌చెరు నుంచి 16 కిలోమీటర్ల దూరంలోగల ఈ కొడకంచి గ్రామానికి ప్రతి గంటకు బస్సులున్నాయి. చూశారుగా…బల్లిదోషం ఉన్న వాళ్లు కంచికి వెళ్లాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఉన్న ఈ కొడకంచికి వెళితే చాలు..బల్లిదోషం తొలగి కంచికి వెళ్లినంత పుణ్యం వస్తుంది. ఒక్క బల్లి దోషం ఉన్న వాళ్లే కాదు…ప్రతి నిత్యం సాధారణ భక్తులు కూడా ఈ కొడకంచిని దర్శించి, కంచికి వెళ్లినంత ఆనందాన్ని పొందుతారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat