Home / UPDATES / షాకింగ్…షుగర్‌తో డైలీ ఇవి తాగితే…లైఫ్ డేంజర్‌లో పడ్డట్లే..!

షాకింగ్…షుగర్‌తో డైలీ ఇవి తాగితే…లైఫ్ డేంజర్‌లో పడ్డట్లే..!

మనకు నీరసంగా ఉన్నప్పుడు చక్కరేసుకుని చిక్కటి ఛాయ్ తాగుతాం…అంతే..ఒక్కసారిగా బాడీ యాక్టివ్‌ అయినట్లుగా, రిలాక్స్‌గా ఫీల్ అవుతాం. అలాగే చక్కరేసుకుని ఓ గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగినా ఫుల్ ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది. కొంత మంది టీ, జ్యూస్‌లలో చక్కెర తక్కువగా ఉంటే ఇష్టపడరు…తీపిదనం కోసం ఓ రెండు చెమ్చాలు షుగర్ వేసుకుని మరీ తాగుతారు..ఇలా ప్రతి రోజూ చక్కెర ఎక్కువ వేసుకుని టీలు, జ్యూస్‌లు తాగేవాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రతి రోజూ చక్కెర వేసుకుని 100 మిల్లీ లీటర్ల స్వచ్ఛమైన పళ్ల రసం లేకుంటే ఛాయ్ తాగే వారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశం 12 శాతం పెరుగుతుందని ఫ్రాన్స్‌ వైద్యులు అంటున్నారు. ఇలా చక్కెర కలుపుకుని టీ, జ్యూస్‌లు తాగే లక్ష మంది ప్రజలు ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసిన పిమ్మట ఫ్రాన్స్ వైద్యులు ఈ విషయాన్ని ప్రకటించారు. చక్కెరతో టీ, జ్యూస్‌లే కాదు.. కార్డియల్, ఫిజ్జీ పాప్‌లు తాగినవారికి కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశం 19 శాతం పెరుగుతాయని వారు తమ నివేదికలో తెలిపారు. రెండు టేబుల్‌ స్పూన్ల చక్కెర వేసుకొని రోజుకు ఒక్క కప్పు టీ తాగినా అంతే ప్రమాదమట. అసలు కోకో కోలా డ్రింక్‌ కన్నా కప్పు ఛాయ్‌ లైఫ్‌ను రిస్క్‌లో పడేస్తుందంట.. ఛాయ్, జ్యూస్‌లలో చక్కెర కలవడం వల్లనే క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని ఫ్రాన్స్ వైద్యులు అంటున్నారు. అయితే ఏజ్‌ను బట్టి షుగర్ లిమిట్‌గా వేసుకుంటే పెద్ద ప్రమాదమేమీ లేదని వారు సెలవు ఇస్తున్నారు. అయితే వీలైనంత వరకు టీ, జ్యూస్‌‌లలో చక్కెర బదులు తేనే వాడడం ఆరోగ్యానికి మంచిది. కొందరు ఛాయ్‌లో షుగర్‌కు బదులు బెల్లం వాడుతారు. బెల్లం టీ కూడా ఆరోగ్యానికి మంచిది. సో..చూశారుగా..రెండు చెమ్చాలు చక్కెర వేసుకుని చిక్కని టీనో, కాఫీనో, లేదా పండ్ల రసం తాగితే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి…చక్కెర తగ్గించండి..లేకుంటే చక్కెరతో చావు తప్పదు..ఓకేనా..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat