Home / ANDHRAPRADESH / రాజధాని రగడ చల్లారలేదా..గవర్నర్‌ దగ్గరకు అమరావతి రైతులతో బీజేపీ ఎంపీ…!

రాజధాని రగడ చల్లారలేదా..గవర్నర్‌ దగ్గరకు అమరావతి రైతులతో బీజేపీ ఎంపీ…!

ఏపీలో జగన్ సర్కార్ రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ..చంద్రబాబు, లోకేష్‌లతో సహా, టీడీపీ నేతలు గత నెలరోజులుగా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా మరిన్ని నగరాలను.. రాజధానులుగా డెవలప్‌ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. అమరావతి విషయంలో ఎంతగా దుష్ప్రచారం చేసినా ఫలితం లేకపోవడంతో చంద్రబాబు స్ట్రాటజీ మార్చాడు. పల్నాడులో తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ..పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. ఛలో ఆత్మకూరు అంటూ రచ్చ చేస్తూ…వైసీపీ ప్రభుత్వాన్ని రాజకీయంగా బద్నాం చేసే పనిలో పడ్డాడు. అయితే రాజధాని రగడను బాబు, లోకేష్‌లు ప్రస్తుతానికి పక్కన పెట్టినా… ఒకప్పటి బాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాత్రం చల్లారనివ్వడం లేదు. టీడీపీలో ఉన్నప్పుడు అమరావతిలో బినామీల పేరుతో భారీగా భూములు కొన్న సుజనా చౌదరి…తమ భూముల విలువ పోతుందనే భయంతో రాజధాని అంశంలో వేలు పెట్టాడు. రాజధానిని తరలిస్తే చంద్రబాబు, లోకేష్‌లతో పాటు తాను అడ్డంగా మునిగిపోతానని సుజనా భావించాడు. అందుకే రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఊరుకునే లేదు అంటూ జగన్‌పై విమర‌్శలు గుప్పించాడు. చంద్రబాబు ఆదేశాల మేరకు అమరావతిలో పర్యటించి రైతులను రెచ్చగొట్టాడు.అంతే కాదు తనకు రాజధానిలో ఒక్క సెంట్ భూమి ఉన్నా..తన పేరు మీద ఉన్నా సరే నిరూపించండి అంటూ మంత్రి బొత్సకు సవాలు కూడా చేశాడు. దీంతో సుజనాకు అమరావతి ప్రాంతంలో బినామీల పేరుతో 650 కు పైగా ఎకరాలు ఉన్నట్లు మంత్రి బొత్స ఆధారాలతో సహా నిరూపించడంతో తేలు కొట్టిన దొంగలా ఉండిపోయాడు.

 ఇక సుజనా అమరావతి పర్యటనలో టీడీపీ నేతలు, కార్యకర్తలే కనిపించడం గమనార్హం. కొందరు టీడీపీ కార్యకర్తలు కాషాయ కండువాలు వేసుకుని, బీజేపీ కార్యకర్తల్లా హల్‌చల్ చేయడం సుజన్నాటకంలో కొసమెరుపు. దీంతో టీడీపీ కార్యాలయం నుంచి వస్తున్న స్క్రిప్ట్‌నే సుజనా చౌదరి చదువుతున్నారని, అసలు బీజేపీలో ఉన్నా, చంద్రబాబు, లోకేష్‌ల వాయిస్‌నే వినిపిస్తూ…..టీడీపీ నేతగానే వ్యవహరిస్తున్నాడంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా చంద్రబాబు, లోకేష్‌లు రాజధాని వివాదాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టి ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అగ్గి రాజేసే పనిలో పడితే సుజనా చౌదరి మాత్రం రాజధాని అంశాన్ని పట్టుకుని వేలాడుతూనే ఉన్నాడు. తాజాగా కొంత మంది తమ సామాజికవర్గానికే చెందిన కొందరు రైతులను తీసుకుని సుజనా చౌదరి గవర్నర్‌ను కలిశాడు. వైసీపీ ప్రభుత్వం అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు ప్రయత్నిస్తోందంటూ గవర్నర్‌‌ చెవిలో వూదారు. రాజధాని మారితే రైతుల నష్టపోతారని, అందుకే రాజధాని మార్చుకుండా చూడాలని రైతన్నలను అడ్డం పెట్టుకుని సుజనా చౌదరి గవర్నర్‌ దగ్గర మొరపెట్టుకున్నాడు. సుజనా చౌదరి తీరుపై ఏపీ ప్రజలు విస్తుపోతున్నారు… కాషాయం కప్పుకున్నాడు.. వరుస మారుస్తాడు అనుకున్నాం..కానీ సేమ్ అదే బాబు భక్తి..అవే పచ్చ పలుకులు…ఓసినీ బాబు భక్తి తగలెయ్య..నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుంది సుజనా అంటూ ఏపీ ప్రజలు..ముక్కున వేలేసుకుంటున్నారు. అంతే కదా..సుజనా పేరుకే బీజేపీలో చేరాడు కానీ..ఎప్పటికైనా చంద్రబాబు గూటిలో చిలకే..పచ్చ పలుకులే పలుకుతాయి. మనం చూస్తూ ఉండాలంతే..ఏమంటారు.