Home / TELANGANA / రేపే కన్నుల పండుగగా గణేష్ శోభాయాత్ర… అన్ని ఏర్పాట్లు పూర్తి…!

రేపే కన్నుల పండుగగా గణేష్ శోభాయాత్ర… అన్ని ఏర్పాట్లు పూర్తి…!

రేపు భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగనుంది. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా గణేష్ శోభాయాత్ర బాలాపూర్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రధాన ర్యాలీ ట్యాంక్‌బండ్ వరకు 18 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఈ రూట్‌లోకి నగరంలోని వివిధ ప్రాంతాలలో నుంచి వచ్చే 17 ప్రధాన ర్యాలీలు కలుస్తాయి. ఇక భక్త జన కోటికి ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న ఖైరతాబాద్ మహాగణపతి
నిమజ్జనానికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా ఖైరతాబాద్ గణేషుడిని తొలి నిమజ్జనం చేయనున్నారు. అప్పటి వరకు ఇతర విగ్రహాల నిమజ్జనాలను నిలిపివేస్తారు. రేపు ఉదయం ఉదయం 11.30 గంటల కల్లా సాగరంలో స్వామి వారిని నిమజ్జనం చేస్తారు. ఈ భారీ విగ్రహాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా తరలించేందుకు పోలీసు యంత్రాంగం సూచనల
మేరకు ముందుస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ అర్థరాత్రి నుంచే నిమజ్జన ఏర్పాట్లును ప్రారంభిస్తారు.

ఇక కన్నుపండుగగా సాగే గణేష్ నిమజ్జనానికి దేశ, విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2 వేల మందికిపైగా పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఇప్పటికే గణేష్ శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు విడుదల చేశారు. ఇక నిమజ్జనం రోజు గూగుల్‌లో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని సామాన్యులు గుగూల్ నుంచి తెలుసుకోవచ్చు. ఎఫ్‌ఎం, ట్విట్టర్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్‌డేట్స్ తెలుసుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. అలాగే గణేష్ నిమజ్జనం నిమిత్తం ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాల్లో ప్రైవేట్ వాహనాలకు అనుమతి రద్దు చేశారు.ఇక్కడకుచిన్న విగ్రహాలను నిమజ్జనానికి తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్ వద్ద గణేష్ నిమజ్జనం కోసం ఈ సారి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గణేష్‌ శోభాయాత్ర సందర్భంగానగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా సొంత వాహనాలు తీసుకురావద్దని పోలీసులు అంటున్నారు. బైకులు, కార్లతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి..ప్రజలంతా రేపంతా ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో మాత్రమే ప్రయాణించాలని హైదరాబాద్ అడిషనల్ ట్రాఫిక్ సీపీ అనిల్ కుమార్ సూచిస్తున్నారు. మొత్తంగా ట్రాఫిక్ పోలీసులతో సహా అన్ని విభాగాల పోలీసులతో దాదాపు 21 వేల మంది బందోబస్తులో విధులు నిర్వహించనున్నారు. భాగ్యనగరంలో రేపటి సామూహిక నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావారణంలో పూర్తి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సర్వం సిద్ధం చేశారు. నిమజ్జన ఉత్సావాలను చూసేందుకు వచ్చే ప్రజలకు పోలీసుల నుంచి ఏ సహాయం కావాలన్నా వెంటనే హెల్ఫ్‌లైన్ నంబర్లకు 040-27852482, 9490598985, 9010203626 ఫోన్ చేయవచ్చు.లక్షలాదిగా తరలివచ్చే గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తాయి. భక్తులు, సామాన్య ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా దరువు.కామ్ విజ్ఞప్తి చేస్తోంది.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat