Home / BUSINESS / బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త

బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త

మీకు ఎస్బీఐలో ఖాతా ఉందా..?. మీరు ఎప్పటి నుంచో ఈ బ్యాంక్ నుండి లావాదేవీలు జరుపుతున్నారా.. అయితే మీకే గుడ్ న్యూస్. అసలు విషయానికి వస్తే ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త ఏమిటంటే తమ ఖాతాల్లో ఉండాల్సిన కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని తగ్గించింది.

పట్టణాల్లో గతంలో ఐదు వేలుండగా దాన్ని మూడు వేలకు తగ్గించింది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో గతంలో ఉన్న రెండు వేల నుంచి కేవలం వెయ్యి రూపాయలకు తగ్గించింది. అవి లేకపోతే జీఎస్టీతో సహా ఫెనాల్టీని వసూలు చేస్తామని ఎస్బీఐ ప్రకటించింది.

ఇక వచ్చే నెల నుంచి మెట్రో నగరాల్లో నెలకు ఏటీఎం నుంచి పది సార్లు ఇతర చోట్ల పన్నెండు సార్లు నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎం లవాళ్లు కేవలం ఐదు సార్లు మాత్రమే చేసుకోవచ్చు.