Home / SLIDER / సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..?

సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..?

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో ముప్పై రోజుల ప్రణాళిక కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాలన్నీ స్వచ్చ అభివృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్ది బంగారు తెలంగాణను నిర్మించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం అని ఆయన అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో డంప్ యార్డ్ నిర్మించాలి. అందుకు ఆరు లక్షలు మంజూరు చేస్తాం. గ్రామాల్లో యువకులు ప్రతి వారం శ్రమదానం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. తడ్కపల్లి గ్రామంలో యువత కోసం గ్రంథాలయం ,జిమ్ ఏర్పాటు చేయిస్తా .. గ్రామంలో యాబై లక్షలతో సీసీ రోడ్లను నిర్మిస్తామని అన్నారు