Home / ANDHRAPRADESH / అయ్యో పాపం..కోడెల కోరికను తీర్చని చంద్రబాబు…!

అయ్యో పాపం..కోడెల కోరికను తీర్చని చంద్రబాబు…!

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు రాజకీయ ప్రస్థానం చివరకు విషాదాంతంగా ముగియడం బాధాకరం. చివరి దశలో చుట్టుముట్టిన కేసులు, పార్టీలో ఎదురైన అవమానాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం. కోడెల వరుస కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందుల్లో ఉన్న దశలో చంద్రబాబు పక్కనపెట్టడం ఆయన్ని తీవ్రంగా బాధించింది. కాగా కోడెల  కోరికను కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోయాడని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే  3 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కోడెల మంత్రిగా మూడుసార్లు పని చేశారు. 1983లో గెలిచినా…1987 వరకు మంత్రిపదవి కోసం వేచి చూడాల్సి వచ్చింది. 1987లో ఎన్టీఆర్ కేబినెట్‌లో తొలిసారిగా హోంమంత్రి అయిన కోడెల రంగా హత్య నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మళ్లీ 1995లో బాబు కేబినెట‌్‌లో మంత్రిగా పని చేశారు. అయితే 2004 నుంచి 2014 వరకు టీడీపీ అధికారం కోల్పోయింది..కోడెల కూడా ఓడిపోయారు. 2014లో రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. కోడెల కూడా సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు. సుదీర్ఘ అనుభవం కలిగిన కోడెలకు హోం మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు. కాని చంద్రబాబు మాత్రం ఆయన్ని స్పీకర్‌గా ఎంపిక చేశారు. నిజానికి చంద్రబాబుకు ఆ ఎన్నికల్లో కోడెలకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించాడు. కానీ కోడెల తన పరపతితో బాబుపై వత్తిడి చేయించి, టికెట్ దక్కించుకుని గెలిచారు. అయినా కోడెలకు మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేని చంద్రబాబు ఆయన్ని స్పీకర్ పదవిలో కూర్చొపెట్టారు. అసలు కోడెలకు మళ్లీ హోంమంత్రిగా పని చేయాలన్నది డ్రీమ్‌గా చెబుతారు ఆయన అనుచరులు.కోడెల కంటే జూనియర్లకు, అనామకులకు మంత్రిపదవులు కట్టబెట్టిన చంద్రబాబు ఆయనకు మాత్రం స్పీకర్‌ పదవి కట్టబెట్టాడు. నిజానికి స్పీకర్ పదవి కోడెల మనస్తత్వానికి తగని పదవి. ఆయన అయిష్టంగానే ఆ పదవి చేపట్టారు. కానీ నవ్యాంధ్ర ప్రదేశ్‌లో మంత్రి కావాలన్న కోడెల కోరికను మాత్రం చంద్రబాబు తీర్చలేకపోయారు. గత ఐదేళ్లు మంత్రి కాలేకపోయాన్న కోడెల పలుమార్లు బాధపడేవారని ఆయన సన్నిహితులు, నరసరావుపేట ప్రజలు అంటున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat