Home / 18+ / జక్కన్న ఫుల్ సపోర్ట్ ఎవరికీ…ఎన్టీఆర్ ? రామ్ చరణ్ ?

జక్కన్న ఫుల్ సపోర్ట్ ఎవరికీ…ఎన్టీఆర్ ? రామ్ చరణ్ ?

టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీ కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన డైరెక్టర్ ఎవరూ అంటే వెంటనే ఎవరికైనా గుర్తొచ్చేది రాజమౌళి నే. ఇతడికి ఉన్న క్రేజ్ ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కు ఉండదు. తన తెలివితేటలతో ప్రతీ హీరోని టాప్ లో ఉంచాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ను హీరోలుగా గా పెట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. దీనికి సంభందించి మొన్నటి వరకు బల్గేరియాలో షూటింగ్ జరగగా అది పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. ఈ చిత్రం కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దానికి సంభందించి కొన్ని సన్నివేశాలు బల్గేరియాలో తీసారు. ఈ పాత్రకు సంభందించి ముఖ్య సన్నివేశాలు ఇక్కడే తీయడం జరిగింది. అంతేకాకుండా ఎన్టీఆర్ ఎంట్రన్స్ ఒక రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఇది అలా ఉంటే మరి రామ్ చరణ్ పరిస్థితి ఏమిటని ఇప్పుడు అందరిలో ఉన్న ఒకేఒక ప్రశ్న. ఎప్పుడు చూసినా వార్తల్లో ఎన్టీఆర్ మాటే వినిపిస్తుందంటు ట్రోల్ చేస్తున్నారు. దీనికి జక్కన్న ఎలాంటి జవాబు ఇస్తాడో వేచి చూడాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat