Home / 18+ / స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..!

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..!

అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్ 20, 1923 లో కృష్ణా జిల్లా, నందివాడ మండలం రామాపురంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడికి చిన్న వయస్సు నుండే నాటకాలు అంటే బాగా ఇష్టం.ఈ నాటకరంగం లో స్త్రీ పాత్రలోనే ఎక్కువగా నట్టించి మంచి పేరు సంపాదించాడు. ఫిబ్రవరి 18, 1949లో ఆయన అన్నపూర్ణను వివాహం చేసుకున్నాడు. వీఇకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అంతేకాకుండా తన భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు ఏఎన్ఆర్. ఇది తన సినీ జీవితానికి వస్తే ప్రముఖ సినీ నిర్మాత ఘంటసాల బలరామయ్య అతడిని సినిమాలకు పరిచయం చేసాడు. తొలినాళ్ళలోనే ఏఎన్ఆర్ తన నటనతో అగ్ర నటుల సరసన నిలిచాడు. 1941లో ధర్మపత్ని సినిమాతో సినిమాల్లో అడుగుపెట్టాడు. తెలుగు, తమిళ్లో ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన నటించిన ప్రతీ చిత్రం సూపర్ హిట్ అయ్యిందనే చెప్పాలి. చిత్ర పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకురావడంలో ఆయన పాత్రే ముఖ్యమైంది. నటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు. అంతేకాకుండా పద్మభూషణ్ అవార్డు తో పాటుగా సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందాడు. వీటితోపాటుగా ఫిలింఫేర్, నంది, కళాసాగర్ ఇలా మరెన్నో పురష్కారాలు పొందాడు.ఏఎన్ఆర్ జనవరి 22, 2014లో మరణించారు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుకి దరువు మీడియా తరపున జన్మదిన శుభాకాంక్షలు..!

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat