Home / ANDHRAPRADESH / కోడెల ఆత్మహత్యకు చంద్రబాబే కారణం…ఇదిగో అసలు సాక్ష్యం..!

కోడెల ఆత్మహత్యకు చంద్రబాబే కారణం…ఇదిగో అసలు సాక్ష్యం..!

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య అత్యంత బాధాకరం. 3 దశాబ్దాలకు పైగా సాగిన కోడెల  రాజకీయ  ప్రస్థానం  చివరకు విషాందాంతంగా ముగియడం ప్రతి ఒక్కరిని కదిలించివేస్తోంది. అయితే చివరి రోజుల్లో చుట్టుముట్టిన కేసులు, చంద్రబాబు పట్టించుకోకపోవడం, పార్టీలో ఎదురవుతున్న అవమానాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోడెల రాజకీయంగా ఇబ్బందుల్లో ఉంటే గత మూడునెలలుగా అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించిన చంద్రబాబు..ఆయన చనిపోయాక మూడు రోజుల పాటు శవరాజకీయం చేయడం గమనార్హం. వైసీపీ ప్రభుత్వం కేసులతో వేధించడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ..ఇది ప్రభుత్వ హత్య అంటూ మూడు రోజుల పాటు చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా గగ్గోలు పెట్టింది.  అంతే కానీ  చంద్రబాబు గత మూడు నెలలుగా  కోడెలను పలకరించని వైనం గురించి, ఆయన సెల్‌ఫోన్ మాయం గురించి, అసెంబ్లీ తరలింపు విషయంలో కోడెలను తన వంధిమాగధులతో తిట్టించిన విషయం గురించి, ఆఖరికి అంతిమయాత్రలో చంద్రబాబు విక్టరీ సింబల్స్ చూపించడం గురించి మాత్రం ఎల్లోమీడియా నోరెత్తదు. కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు, బాలయ్యల ఉత్సాహం చూసి..దీని వెనుక ఏదో కుట్ర ఉందనే అనుమానం వస్తోంది.

అసలు కోడెల వంటి సీనియర్ నేతలు అంటే చంద్రబాబుకు ఎప్పుడూ భయమే. తనతో సమానమైన వాళ్లు ఉంటే బాబు భరించలేడు. అధికారంలో ఉన్నప్పుడు కే ట్యాక్స్ వివాదం నేపథ్యంలో చంద్రబాబు కోడెలను పిలిపించి…నీ కొడుకు, కూతురు అవినీతి వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోంది..కాస్త అదుపులో పెట్టుకుని కోపంగా మాట్లాడాడంట..అప్పుడు కోడెల కూడా అంతే సీరియస్‌గా మరి నీ కొడుకు లోకేష్ అవినీతి గురించి ఏంటీ..మాకు తెలియదా..మీ తండ్రీ కొడుకులు ఎంత దోచుకున్నారో..ముందు నీ కొడుకును అదుపులో పెట్టుకుని నాకు చెప్పు..అని సమాధానం ఇచ్చాడంట..ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిందని…అప్పటి నుంచి చంద్రబాబు కోడెలకు మాటల్లేవని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ఇది మనసులో పెట్టుకున్న చంద్రబాబు కోడెలకు వ్యతిరేకంగా సత్తెనపల్లి, నరసరావుపేట టీడీపీ నేతలతో ధర్నాలు చేయించాడని సమాచారం. కోడెల వద్దు..చంద్రబాబు ముద్దు అంటూ అసమ్మతి నేతలు ఎన్నికలకు ముందు ర్యాలీలు నిర్వహించారు. దీంతో కోడెలకు టికెట్ ఇవ్వడం కష్టమని బాబు తేల్చి చెప్పాడని సమాచారం. అయితే చంద్రబాబుకు సన్నిహితుడైన ఓ పత్రికాధిపతి..కోడెలకు టికెట్ ఇవ్వకుంటే పల్నాడులో టీడీపీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం పడుతుందని హెచ్చరించడంతో ఏం చేయలేక..చంద్రబాబు కోడెలకు టికెట్ ఇచ్చాడు. అయితే అంబటి రాంబాబు చేతిలో కోడెల అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. ఇదే సమయంలో కోడెల ఫ్యామిలీపై కే ట్యాక్స్, ఫర్నీచర్ తరలింపు కేసులు వచ్చి పడ్డాయి. దీంతో చంద్రబాబు ఇదే అదనుగా కోడెలను, ఆయన కొడుకు, కూతురును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మీడియాకు లీక్‌లు ఇచ్చాడు. పైగా ఎల్లోమీడియాలో కోడెల వల్ల పార్టీ పరువు పోతుందంటూ వరుస కథనాలు వచ్చేలా చేశాడు. పైగా అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో కోడెల వంటి సీనియర్ నేతను వర్ల రామయ్య , సత్తెనపల్లి టీడీపీ నేతలతో తిట్టించాడు. అంతే కాదు కోడెలను బతికుండగానే వదిలించుకునే ప్రయత్నాలు చేశాడు చంద్రబాబు.

కోడెలను పార్టీ నుంచే కాదు..సొంత కులం నుంచే దూరం చేసే ప్రయత్నాలు జరిగాయి. కోడెల బతికుండగా ధీరుడు, వీరుడు, పేదల పెన్నిధి అంటూ పల్లకీ మోసిన కమ్మ సామాజికవర్గం ఎప్పుడైతే ఆయన
రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డారో..అప్పటి నుంచి ఆయనపై విషం కక్కింది. కమ్మ కులం ఆధ్వర్యంలో నడిచే” కమ్మ వైభవం” అనే మాస పత్రికలలో కోడెలపై అత్యంత అవమానకరరీతిలో కథనం ప్రచురించారు. ప్రభుత్వాన్ని, కులాన్ని భ్రష్టు పట్టించిన నీచుడు, నీచుడు, నికృష్టుడు అంటూ దారుణంగా అవమానించారు. ఒకప్పుడు కోడెల ధైర్య సాహసాలను కమ్మ సామాజికవర్గం వారు..కథలు కథలుగా చెప్పుకుని మురిసిపోయేవారు. అసలు బాలయ్య సింహా మూవీ కోడెల రియల్ లైఫ్ స్టోరీ అంటూ కులాభిమానులు గర్వంగా చెప్పుకునేవారు. అయితే ఎప్పుడైతే రాజకీయంగా ఇబ్బందులు పడి…చంద్రబాబుతో చెడిందో..కమ్మ సామాజికవర్గం కూడా ఆయన్ని దూరం పెట్టడం ప్రారంభించింది. దానిలో భాగమే..కమ్మ వైభవం పత్రికలోని “మనకేల కోడెల” అంటూ వచ్చిన కథనం. కోడెల లాంటి నీచుడు కమ్మ కులానికి అవసరం లేదని , అతన్ని వేలేయాలని, అతని కుటుంబ సభ్యులు పరమనీచంగా దోచుకున్నారని , వాళ్లకి కోడెల ఆశీస్సులు కూడా ఉన్నాయని స్వయంగా వాళ్ళ పత్రికలోనే రాసుకున్నారు.

ఇది ఎప్పుడో కాదు..కోడెల చనిపోయే కొద్ది రోజుల ముందు వచ్చిన సెప్టెంబర్ ఎడిషన్‌లోనే వచ్చింది. ఈ రోజు కోడెల చనిపోయాక ముసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబుతో సహా…టీడీపీ కార్యకర్తలు, అభిమానులందరూ ఒకసారి ఈ కమ్మ వైభోవం సెప్టెంబర్ ఎడిషన్ ని తెప్పించుకొని చదివండి…ఆయన బతికుండగానే వదిలించుకోవాలని చూసిన సంగతి బయటపడుతుంది. ఇంతకీ ఈ కమ్మ వైభవం అనే మాస ప్రతిక చంద్రబాబు ఆశీస్సులతో నడుస్తున్న పత్రిక అని తెలుస్తోంది. చూశారుగా కోడెలను దారుణంగా అవమానించి, పార్టీ నుంచి, కులం నుంచి దూరం చేసింది ఎవరో మీకు అర్థమైందనుకుంటా…అటు పార్టీ, ఇటు కులం చీదరించుకోవడంతో పల్నాటి పులి లాంటి కోడెల తట్టుకోలేకపోయారు. అందుకే తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. చూశారుగా ఎవరినైనా పార్టీ నుంచి పంపించివేయాలనుకుంటే చంద్రబాబు చేసేది ఇదే..వారిపై ఎల్లోమీడియాలో, కుల పత్రికలలో ఇలా వ్యతిరేక కథనాలు వచ్చేలా చేసి మానసికంగా కుంగదీయిస్తాడు. దీంతో వారంతవారే పార్టీ నుంచి వెళ్లిపోవడం, లేకపోతే ఇలా కోడెలలా ఆత్మహత్య చేసుకునేలా చేస్తాడు. మొత్తంగా కోడెల ఆత్మహత్యకు చంద్రబాబుతో పాటు, ఆయనకు వంత పాడే  సామాజికవర్గం కూడా కారణమైందనే చెప్పాలి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat