Home / MOVIES / గద్దలకొండ గణేష్ భారీ వసూళ్లు..రెండో రోజు రిపోర్ట్

గద్దలకొండ గణేష్ భారీ వసూళ్లు..రెండో రోజు రిపోర్ట్

వరుణ్ తేజ్ మెగా కాపౌండ్ నుంచి వచ్చిన యువహీరో.. బ్యాక్ డ్రాప్ మెగా వాల్ కాబట్టి అవకాశాలు తన్నుకువస్తాయి. ఎందుకో సినీ పరిజ్ఞానమున్న ప్రతోక్కరికి తెలుసు.. వరుణ్ తేజ్ నటించిన సినిమాలన్నీటిలో సరికొత్త జోనర్ కథలను ఎంచుకుంటూ నటిస్తూ వస్తున్నాడు.ఇప్పటిదాక నటించిన చిత్రాలన్నిటిలో ప్రేమ, కామెడీ ఇదే జోనర్లో కథలను ఎంచుకుంటూ మెగా కాపౌండుకు ఎలాంటి నష్టం రాకుండా నటిస్తూ వచ్చాడు. కాసేపు వీటిన్నిటీని పక్కనెడదామనుకున్నాడేమో డిఫరెంట్ కథ(మూవీ రీమేక్ కథనే)తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు..అదే వాల్మికీ ఆలియాస్ గద్దలకొండ గణేష్..దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేష్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే, తమిళ నటుడు అధర్వ, కమెడియన్లు సత్య, రచ్చరవి తదితరులు కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 20 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే.. తెలుగు రాష్ట్రాల్లో గద్దలకొండ గణేష్ చిత్రం తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజున రూ.5.83 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో కలుపుకొని రూ.6.81 కోట్ల షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా చూసుకొంటే
నైజాంలో ఈ చిత్రం రూ.1.63 కోట్లు,
సీడెడ్ రూ.0.82 కోట్లు,
వైజాగ్‌లో రూ.0.69 లక్షలు,
గుంటూరులో రూ.0.71 లక్షలు,
తూర్పు రూ.0.48 లక్షలు,
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.0.58 లక్షలు,
కృష్ణా రూ.0.42 లక్షలు,
నెల్లూరులో రూ.16 లక్షలు వసూలు చేసింది. రెండో రోజు వసూళ్లు ఇక రెండో రోజు ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. రెండో రోజు అర్బన్‌లో 25 శాతానికి పైగా కలెక్షన్లు క్షీణించాయని, మాస్ ఏరియాలో 20 శాతానికి పైగా పడిపోయినా వసూళ్లలతో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. రెండో రోజు రూ.3 కోట్ల షేర్ సాధించడానికి అవకాశముందని పేర్కొంటున్నారు. దాంతో సుమారు 10 కోట్లకు చేరువగా వసూళ్లు ఉండే అవకాశం ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat