Home / TELANGANA / టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్‌కు లాభం.. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కు లాభం…మంత్రి కేటీఆర్..!

టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్‌కు లాభం.. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కు లాభం…మంత్రి కేటీఆర్..!

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కి లాభం టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్ కి లాభం ఇదే మా నినాదం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల గురించి స్పందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ట్రక్కు గుర్తు వల్లనే టిఆర్ఎస్ ఓడింది కాని…సాంకేతికంగా మేము అప్పుడే గెలిచామని కేటీఆర్ అన్నారు. ఈసారి హుజూర్‌న గర్ గడ్డ పైన గులాబీ జెండా ఎగరేస్తాం అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.  మాకు ప్రతికూలతలు లేవు..అంతా సానుకూలంగానే ఉంది ..హుజూర్‌నగర్ ప్రజలకు పూర్తి స్పష్టత ఉన్నది…నాలుగు సంవత్సరాల మూడు నెలల పాటు తమ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విజ్ఞులైన హుజూర్‌నగర్ ప్రజలు టీఆర్‌ఎస్ ని గెలిపించుకొని అభివృద్ధిని సాధించుకుంటారు అని కేటీఆర్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలకు ఉప ఎన్నికలకు తేడా ప్రజలకు తెలుసు… కాంగ్రెస్ కి ఓటు వేయడం వల్ల లాభం లేదని తెలుసు…అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి కాబట్టి పరాభవం కానేకాదు… ఓడిపోయిన సీట్లు కూడా తక్కువ ఓట్లతోనే ఓడిపోయాం..అప్పుడు మోడీ ప్రభావం పనిచేయడం వలన బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచింది కానీ రానున్న ఉప ఎన్నికల్లో ఆ పార్టీ సాధించే ఓట్ల శాతం అత్యల్పంగా ఉండబోతుందని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పార్లమెంట్ ఎన్నికలు తరువాత జరిగిన జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని…ఈవీఎంలు అయినా బ్యాలెట్ అయినా టిఆర్ఎస్ పార్టీనే గెలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు. హుజూర్‌‌నగర్ ఎన్నికల్లోనూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి వినమ్రంగా ఓట్లు అడుగుతామని ఆయన అన్నారు.

అసలు హుజూర్‌నగర్‌లో మాకు పోటీ కాంగ్రెస్‌తోనే కాని బీజేపీతో కానే కాదు అని కేటీఆర్ తేల్చి చెప్పారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి నాయకత్వం పట్ల విశ్వాసం లేకనే పార్టీ మారుతున్నారు… పార్టీ ఫిరాయింపుల పైన మమ్మల్ని నిందించి లాభం లేదని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు చురకలు అంటించారు. జిల్లా నాయకులు ఆత్మ విశ్వాసంతో ఉన్నారని హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని కేటీఆర్ అన్నారు.  తాజాగా నిర్వహించిన సర్వేలో 55 శాతం టీఆర్ఎస్ పార్టీకి 41 శాతం కాంగ్రెస్ కి ఉందని…ఆయన చెప్పుకొచ్చారు. ఇక హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారం గురించి మాట్లాడుతూ…పార్టీ నిర్ణయించిన 30మంది ఇన్‌చార్జిలు సెప్టెంబర్ 26 నుంచి ఎన్నికల ప్రచారం లోకి దిగుతారని కేటీఆర్ ప్రకటించారు.హుజూర్‌నగర్ ఎన్నికల్లో వంద శాతం గెలుస్తాం
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని…సీఎం కేసీఆర్ సభ పైన ఒకటి రెండు రోజుల్లో ఎప్పుడు పాల్గొనేది స్పష్టత వస్తుందని కేటీఆర్ అన్నారు. ఏ ఎన్నికైనా సీరియస్‌గానే తీసుకుంటాం..ఎన్నిక ఎన్నికనే 24 అక్టోబర్ నాడు మెజార్టీ ఎంత చెబుతామని కేటీఆర్ చెప్పారు. అనేక మంది కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు గతంలో సవాలు విసిరి తోక ముడిచారని ఈ సందర్భంగా కేటీఆర్ ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్ ఎన్నిక రెఫరెండం అన్న సవాలును సీరియస్ గా తీసుకోమని.. మా పని మేం చేసుకుంటూపోతం… కచ్చితంగా ప్రజలు మాకు మద్దతు ఇస్తారు అన్న నమ్మకం ఉందని కేటీఆర్ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లో బెస్ట్ ఆఫ్ త్రీ లో రెండింటిని గెలిచామని ఆయన గుర్తు చేశారు. రైతుబంధు, రైతు బీమా ఇచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీపై రైతుల్లో వ్యతిరేకత ఉంటుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతుబంధు పథకాన్ని మోడీ ఆదర్శంగా తీసుకున్నారు… హుజూర్‌నగర్ రైతులంతా టీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఇక.క్యాబినెట్ విస్తరణ తర్వాత పార్టీలో అసంతృప్తి అన్నది కేవలం మీడియా సృష్టే అని కేటీఆర్ స్పష్టం చేశారు. మొత్తంగా హుజూర్‌నగర్ గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని..కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat