Home / ANDHRAPRADESH / వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి…టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!

వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి…టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!

2020 ఏప్రిల్ నాటికి ప్రకాశం జిల్లావాసుల ఆశల సౌధమైన వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ అధికారులను కోరారు. బుధవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో సీఈ జలందర్, ఎస్ ఈ వీర్రాజు సుబ్బారెడ్డితో భేటీ అయిన వైవి సుబ్బారెడ్డి…వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులపై సమీక్ష చేశారు. కాగా వెలిగొండ మొదటి సొరంగం 18.8 కిలో మీటర్లకు గాను ఇప్పటిదాకా 17.3 కిలో మీటర్లు, రెండో సొరంగం 11.2 కిలో మీటర్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలు తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని గత ప్రభుత్వ హయాంలో తాను పాదయాత్ర చేసిన విషయాన్ని అధికారులకు గుర్తు చేశారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఏడాది రూ.485 కోట్లు విడుదల చేసినట్లు వైవీ తెలిపారు. వెలిగొండ రిజర్వాయర్ నుంచి కంభం చెరువు, పామూరు సమీపంలోని మోపాడు రిజర్వాయర్లను నింపేట్లు కాలువలు డిజైన్ చేయాలని సుబ్బారెడ్డి అధికారులకు సూచించారు. అలాగే గుండ్లకమ్మ ప్రాజెక్టు, యర్రం చిన్న పోలిరెడ్డి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మిగిలి ఉన్న కొద్దిపాటి పనులను పూర్తి చేసి ఆయకట్టు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో సాగు, తాగు నీరందించాలని ఆయన కోరారు. పనులను వేగంగా పూర్తి చేయాలని సుబ్బారెడ్డి సూచించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా..వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని పూర్తి చేసి ప్రకాశం జిల్లా ప్రజలకు తాగు, సాగునీటిని అందించే దిశగా వైవీ సుబ్బారెడ్డి పనులను వేగవంతం చేయిస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat