Home / ANDHRAPRADESH / సంచలనం..చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి బాగోతాలపై విచారణకు రంగం సిద్ధం…!

సంచలనం..చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి బాగోతాలపై విచారణకు రంగం సిద్ధం…!

గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడిన నారావారి ఫ్యామిలీ పాపం పడిందా…త్వరలోనే తండ్రీ కొడుకుల అవినీతి బట్టబయలు అవుతుందా.. చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి నిగ్గు తేల్చేందుకు ఏపీ లోకాయుక్త రంగంలోకి దిగుతుందా..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. గత ఐదేళ్ల పాలనాకాలంలో చంద్రబాబు, లోకేష్‌లు రాజధాని పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి వేల కోట్లు దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కూడా చంద్రబాబు, లోకేష్‌లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయి భారీగా ఎస్టిమేషన్లు పెంచేసి, కోట్లాది రూపాయల కమీషన్లు కొట్టేసారని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన వైసీపీ బాబుహయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై ఓ కమిటీ వేసింది. విచారణ జరిపిన ఆ కమిటీ పోలవరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని నిర్దారించింది. దీంతో ప్రభుత్వం గత పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. ఇక ఇసుక మాఫియా, సున్నపురాయి మాఫియా, నీరు – చెట్టు, ఇలా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు జరిగిన అవినీతిలో బాబు, లోకేష్‌లకు వాటాలు వెళ్లేవని విమర్శలు ఉన్నాయి. తాజాగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఏపీ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. డేరంగుల ఉదయ్‌ కిరణ్ అనే వ్యక్తి గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న చంద్రబాబు, లోకేష్‌లు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి ప్రజా ధనాన్ని దోచుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇసుక దోపిడీ, రాజధాని నిర్మాణం,, పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిలో బాబు, లోకేష్‌ల హస్తం ఉందని…ఉదయ్ తన పిటీషన్‌లో పేర్కొన్నాడు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని, బాబు, లోకేష్‌లపై వెంటనే విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు లోకాయుక్తను కోరాడు. అయితే డేరంగుల్ ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ లోకాయుక్త విచారణ చేపడుతుందా లేదా అన్న ఉత్కంఠ ఏపీ రాజకీయ వర్గాల్లో నెలకొంది.. గతంలో కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయి నేతలపై లోకాయుక్త విచారణ చేపట్టింది. అదే తరహాలో ఏపీ లోకాయుక్త చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ నిజంగానే ఏపీ లోకాయుక్త ఈ కేసును సీరియస్‌గా టేకప్ చేసి విచారణ చేపడితే గత ఐదేళ్లలో చంద్రబాబు, లోకేష్‌ల అవినీతా బాగోతాలు బయటపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే లోకాయుక్త ముందుకు చంద్రబాబు, లోకేష్‌లు హాజరు కాక తప్పని పరిస్థితి వస్తుంది. కాగా ఏపీ లోకాయుక్తగా ఇటీవల జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మరి లక్ష్మణ్ రెడ్డి చంద్రబాబు, లోకేష్‌లపై వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. మొత్తంగా ఏపీ లోకాయుక్త రంగంలోకి దిగితే చంద్రబాబు, లోకేష్‌లు చిక్కుల్లో పడడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat