Home / ANDHRAPRADESH / చంద్రబాబు, లోకేష్‌ల‌ ఇజ్జత్ తీసిన ఎన్టీఆర్ సతీమణి..!

చంద్రబాబు, లోకేష్‌ల‌ ఇజ్జత్ తీసిన ఎన్టీఆర్ సతీమణి..!

చంద్రబాబు, లోకేష్‌లపై దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు చేశారు. పీపీఏలు, రాజధాని తరలింపు, పోలవరం రివర్స్‌టెండరింగ్‌‌లపై చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలు వైసీపీ సర్కార్‌పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు స్పందించిన వైసీపీ నేత లక్ష్మీ పార్వతి చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పీపీఏలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో చంద్రబాబు 6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక నారావారి పుత్రరత్నం లోకేష్‌పై కూడా లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్‌ చేశారు. కేవలం ట్విట్టర్‌లో మాత్రమే మాట్లాడే కొడుకును కన్నఘనత చంద్రబాబుదే అంటూ లోకేష్‌ను ఉద్దేశించి ఆమె ఎద్దేవా చేశారు. ఏనాడు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం నారా లోకేష్ చేయలేరని…అసలు ప్రజల ముందు లోకేష్ మాట్లాడితే పరువు పోతుందని చంద్రబాబుకు తెలుసని..అందుకే తన కొడుకును ట్విట్టర్‌కే పరిమితం చేశారని, పాపం ఎన్ని ట్యూషన్లు పెట్టించినా లాభం లేకపోయిందని…సెటైర్లు వేశారు ఇక ఏపీలో ప్రజాహిత పాలనతో ముందుకు వెళుతున్న జగన్‌పై విమర్శలు చేసే హక్కు చంద్రబాబుకు లేదని లక్ష్మీ పార్వతి అన్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారని..బాబు వస్తే జాబు వస్తుందన్న చంద్రబాబు గత ఐదేళ్లలో ఒక్క జాబు అయినా ఇచ్చాడా…జగన్‌‌లా ప్రజలకు ఏమైనా మేలు చేశాడా అంటూ ఆమె ప్రశ్నించారు. జగన్ పాలనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు తట్టుకోలేక చంద్రబాబు ఎల్లోమీడియాతో అడ్డగోలుగా దుష్ప్రచారం చేయిస్తున్నాడని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లపై లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. చినబాబు ట్విట్టర్‌లో మాట్లాడడం తప్ప..బయట మాట్లాడే పరిస్థితి లేదని..ఇదే విషయాన్ని లక్ష్మీ పార్వతి పబ్లిక్‌గా చెప్పి ఇంకా దెప్పిపొడుస్తుందంటూ..తెలుగు తమ్ముళ్లు తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. లోకేష్‌ ఒక్కడు చాలు..తమ బాస్ చంద్రబాబు కొంప మునగడానికి అంటూ టీడీపీ నేతలు ఓపెన్‌గానే జోకులు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat