Home / 18+ / ‘సైరా’ భామలకు పోటీగా త్రిష… నెగ్గేదెవరూ..?

‘సైరా’ భామలకు పోటీగా త్రిష… నెగ్గేదెవరూ..?

మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. ఇందులో నయనతార, తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రం తరువాత చిరు తన 152వ సినిమా కొరటాల దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందులో చిరంజీవి సరసన తమన్నా లేదా నయనతార అని ముందుగా అనుకున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వీరిద్దరిని కాదని కొరటాల త్రిష ను అనుకుంటున్నాడట. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో స్టాలిన్ సినిమా వచ్చింది. అది ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇది ఓకే అయితే 14 ఏళ్ల తరువాత మల్లా వీరి కలయికలో చిత్రం రానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat