Home / ANDHRAPRADESH / సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. ఆ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకే…!

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం.. ఆ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకే…!

ఏపీలో జగన్‌ సర్కార్ ఇసుకమాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు యధేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. వేల కోట్లు అక్రమంగా గడించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇసుకరీచ్‌లను రద్దు చేసి నూతన ఇసుక విధానానికి రూపకల్పన చేశారు. టన్ను ఇసుక రూ. 375/- కే సామాన్యుడికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇసుక మాఫియాపై ఇవాళ జరిగిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ స్పందించారు. ఇక నుంచి రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఇసుక మాఫియా కనిపించకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత నెలకొన్న నేపథ్యంలో సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.  ఇసుక రవాణ చేస్తామంటూ ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీకు ఎవరు ముందుకు వచ్చినా వారిని ఆ బాధ్యతను అప్పగించాలన్నారు. కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున ఎవరు ముందుకు వచ్చినా రవాణా కోసం వాహనాలను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. అయితే దీనిని అదునుగా తీసుకుని ఇసుక అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఇవ్వద్దని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..రాష్ట్రంలోని అన్ని ఇసుకరీచ్‌లను ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించాలని. ఆ అధికారి కేవలం ఇసుక సరఫరా, రవాణాలను మాత్రమే చూడాలని సూచించారు. ఇక రాష్ట్రంలో వరదలు తగ్గాయి, ఇసుక లభ్యత ఉంది కనుక తక్కువ రేట్లకు అందించాలి. వచ్చే 60 రోజుల్లో కచ్చితంగా మార్పు రావాలి. ప్రతి జిల్లాలోని 2 వేలమంది నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన యువకులు ఆయా కార్పొరేషన్ల ద్వారా, కాపు కార్పొరేషన్‌ కలుపుకుని వాహనాలు కొనుగోలు చేసేలా చూడాలి. వారికి ఇసుక రవాణా కాంట్రాక్టు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై మార్గదర్శకాలు తయారు చేయాలి. ఇదే సమయంలో ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడాలి. కలెక్టర్లు, ఎస్పీలు దీనిపై దృష్టిపెట్టాలి. రాజకీయ జోక్యాన్ని ఎక్కడా కూడా అనుమతించరాదు. గత ప్రభుత్వానికీ, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా కచ్చితంగా కనిపించాలి. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు. ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాను. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా ఉండకూడదు. చెక్‌పోస్టుల్లో గట్టి నిఘాను పెంచండి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రవాణా కాంట్రాక్టు పనులు ప్రతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 2 వేల మంది నిరుద్యోగ యువకులకు అప్పగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇదివరకే ప్రభుత్వ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు అందిస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఇసుక రవాణా కాంట్రాక్టు పనులను, జిల్లాకు 2 వేల మంది చొప్పున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన  నిరుద్యోగ యువతకు  అప్పగించడం పట్ల సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే దాదాపు లక్షన్నర గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు జిల్లాకు 2 వేల మంది చదువుకున్న యువతకు ఇసుక రవాణా కాంట్రాక్టులు ఇస్తూ వారికి ఉపాధి కల్పించనుంది. దీంతో ఊరూరా యువతకు చేతినిండా పని దొరకనుంది. పనికి తగ్గ సంపాదన అందనుంది. మొత్తంగా ఇసుక మాఫియాను పూర్తిగా నియంత్రించడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఇసుక రవాణా కాంట్రాక్టులు అప్పగించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat