టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా .. పద్నాలుగు రీల్స్ ప్లస్ బేనర్ పై రాము ఆచంట,గోపి ఆచంట నిర్మాతలుగా హారీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేష్.
ఈ చిత్రం గత నెల సెప్టెంబర్ 20వ తారీఖున విడుదలైన మంచి హిట్ టాక్ ను తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రంలో ఆథర్వ మురళి,మృణాలినీ రవి మరో కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమాలో ఒక ఎమోషనల్ సీన్ ను తొలగించారు. అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ సీన్ లో పూజా,వరుణ్ తేజ్ పారిపోయి పెళ్లి చేసుకోవాలి. దానికి సంబంధించిన ఈ సీన్ గుండెలను పిండేసింది. మీరు ఒక లుక్ వేయండి.