Home / 18+ / 200అడుగుల లోతున నీరు వేగంగా ప్రవహిస్తుంది.. లంగరు వేస్తున్నాం.. దేనికి తగులుతుందో చెప్పలేకపోతున్నాం

200అడుగుల లోతున నీరు వేగంగా ప్రవహిస్తుంది.. లంగరు వేస్తున్నాం.. దేనికి తగులుతుందో చెప్పలేకపోతున్నాం

తూర్పు గోదావ‌రి జిల్లా క‌చ్చూలూరు వ‌ద్ద జ‌రిగిన బోటు ప్ర‌మాదంలో మునిగిన బోటుని వెలికితీయ‌డానికి అధికారులు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ రాయ‌ల వశిష్ట ముందుకు సాగ‌ట్లేదు. నాలుగు రోజులుగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించడం లేదు. గత నెల 15న మ‌ధ్యాహ్నం ఒంటిగంటకు ప్ర‌మాదం జ‌రిగింది. స్థానికులు ర‌క్షించిన 26 మంది మాత్రమే సుర‌క్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. బోటులోని మిగతా ప్రయాణికుల్లో 36 మంది మృత‌దేహాల‌ను ఇప్ప‌టివరకు క‌నుగొనగాన్నారు. అమితే ప్ర‌మాదం జ‌రిగిన క‌చ్చులూరికి సుమారు 80 కిలోమీట‌ర్ల దూరంలో పాశ‌ర్ల‌పూడి దగ్గర రెండు మృత‌దేహాలు దొరికాయి. దీనినిబట్టి గోదావ‌రి వేగం అర్ధం చేసుకోవచ్చు. ఇంకా 15 మృత‌దేహాలు దొరకాల్సి ఉంది. అవి బోటులో దిగువ‌న ఇరుక్కుని ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. గోదావ‌రిలో గతంలోనూ ప్రమాదాలు జరిగాయి. కాస్త ఆల‌స్యంగానైనా బోట్లు ఒడ్డుకు చేర్చారు. 2018లోనూ ప‌శువుల్లంక వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో వారంపాటు శ్ర‌మించినా రెండు మృత‌దేహాల తెలియలేదు.

 

గోదావ‌రి పొడ‌వునా ప‌రిశీలిస్తే క‌చ్చులూరు వద్దే నది అత్యంత లోతుగా ఉంటుంద‌ని వెల్లడైంది. రెండుకొండ‌ల మ‌ధ్య‌లో న‌దీ ప్ర‌వాహం సాగ‌డంతో అక్క‌డి గోదావ‌రి వ‌డి ఊహించ‌నంత వేగంగా ఉంటుంది. లోతుకూడా 300 అడుగులు ఉంటుంది. ఇప్పుడు నీటిమ‌ట్టం త‌గ్గింది కాబ‌ట్టి క‌నీసంగా 200 అడుగులు పైనే ఉంటుంది. అంత వేగంగా ప్ర‌వ‌హించే నదీ జలాల మ‌ధ్య లోతులోకి వెళ్లి గాలింపు చేప‌ట్ట‌డం పెద్ద స‌వాలేనట. ఎన్డీఆర్ఎఫ్ ప్ర‌తినిధులు మాత్రం బోటు వెలికితీత విషయమై ముంబయి, ఉత్త‌రాఖండ్ నుంచి నిపుణులు వ‌చ్చారు. అక్క‌డి ప‌రిస్థితి గ‌మ‌నించి బోటు ఎక్క‌డ ఉంద‌నే విష‌యాన్ని ధృవీక‌రించారన్నారు. అలాగే 200 అడుగుల లోతులో ఉన్న బోటును వెలికితీసిన చ‌రిత్ర ఇప్ప‌టివరకు లేదని చెప్పారు. భౌగోళికంగానూ క‌చ్చులూరులో వెలికితీత ప్ర‌య‌త్నాలు చేయడం కష్టంగా ఉందన్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముంబయి నుంచి బృందాలు వస్తాయన్నారు. కానీ ఇప్పటికీ రాలేదు. బోటుకు తాడు త‌గిలింద‌ని అంచ‌నాలొచ్చినా అదీ ఫలించలేదు. అలాగే కొంత ఆయిల్ తెట్టు కూడా వచ్చినట్టు గుర్తించారు. అడుగున నీరు చాలా వేగంగా వెళ్తుండడంతో పైనుంచి తాళ్లు, లంగ‌రు వేస్తున్నా దేనికి త‌గులుతుందో చెప్ప‌లేకపోతున్నారు. బోటుకే త‌గిలింద‌నుకున్నా కానీ అది రాయికి త‌గిలి తాడు తెగిపోయిందట. ఇలా ప్ర‌య‌త్నాలు త‌ప్ప ఎవరూ చేసేది ఏమీ లేదని, బోటును ఎప్ప‌టికి ఒడ్డుకి చేర్చ‌గలరో చెప్పలేమంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat