Home / SLIDER / హుజూర్‌న‌గ‌ర్ ఎన్నిక‌…అన్ని పార్టీలు ఒకవైపు.. ఈ పార్టీ మరో వైపు..!

హుజూర్‌న‌గ‌ర్ ఎన్నిక‌…అన్ని పార్టీలు ఒకవైపు.. ఈ పార్టీ మరో వైపు..!

హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక విష‌యంలో సీపీఎం పార్టీ డైలామాలో ప‌డింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఆ పార్టీ ఎవరికి మద్దతునిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది. వామపక్ష పార్టీ అయిన సీపీఐ ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో సీపీఎం కూడా అదేబాటలో మద్దతు ప్రకటిస్తుందా? అనే చర్చ జరుగుతోంది.

కాగా, సీపీఎం పార్టీ వైఖరిని తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నించగా.. నామినేషన్ తిరస్కరణపై న్యాయపరమైన అవకాశాలను చర్చిస్తున్నామని, ముందుగా ఈ విషయంపై ఈసీని కలిసిన అనంతరం కోర్టును ఆశ్రయించనున్నట్టు చెప్పారు. న్యాయపరంగా పోటీలో నిలిచే అవకాశం లేకపోతే.. 6వ తేదీన పార్టీ వైఖరిని స్పష్టం చేస్తామని కీలకనేత ఒకరు వెల్లడించారు. సెంట్రల్‌కమిటీ ఆదేశాలకనుగుణంగా నిర్ణయం వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఇప్ప‌టికీ…కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు కోరుతుండ‌టం విశేషం.

ఇదిలాఉండ‌గా, హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్టు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ప్రకటించారు. హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డిని కలిసి మద్దతిస్తున్నట్టు తెలిపారు. అనంతరం మాలమహానాడు నాయకులతో కలిసి చెన్నయ్య మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని మాల మహానాడు కమిటీలు టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషిచేయాలని సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat