Breaking News
Home / MOVIES / కొరటాల శివ దర్శకత్వంలో చిరు

కొరటాల శివ దర్శకత్వంలో చిరు

టాలీవుడ్ సీనియర్ నటుడు ,మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. తమన్నా,అనుష్క ,అమితాబ్ ,సుదీప్ ,విజయ్ సేతుపతి,జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలో నటించగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారించారు. అయితే తాజా చిత్రం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నట్లు కన్ఫామ్ అయింది.

దర్శకుడు శివ నేతృత్వంలో చిరు నూట యాబై రెండో మూవీని వచ్చే నెల మొదటి వారంలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.దీనికి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో చిత్రం కోసం ప్ర‌త్యేక సెట్ కూడా రూపొందించిన‌ట్టు సమాచారం. తొలి షెడ్యూల్ మొత్తాన్ని ఈ సెట్‌లోనే చిత్రీక‌రించనున్న‌ట్టు తెలుస్తుంది. రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది.