ఎస్.ఎస్. రాజమౌళి… తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు. ఈ కధారచయిత కె.వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఈయన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు. తాను తీసిన సినిమాల్లో ఇప్పటివరకు ఒక్క చిత్రం కూడా పరాజయం చెందలేదు అంటే అతని ప్రత్యేకత ఏమిటో మీరే అర్ధం చేసుకోవచ్చు. తన సినిమాలు అన్నింటికీ కుటుంబంతో కలిసి తీస్తాడు.. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి అతనికి అన్నయ్య..మరియు అతడి భార్య తాను తీసిన అన్ని సినిమాల్లో డిజైనర్ గా చేస్తుంది. ఇక జక్కన్న తీసిన బాహుబలి రెండు పార్ట్శ్ అయితే ఒక ప్రభంజనం సృష్టించాయని అందరికి తెలిసిందే. అంతేకాకుండా వసూళ్ళు పరంగా ప్రపంచవ్యాప్తంగా 1800కోట్ల రూపాయలు వసూళ్ళు చేసింది. ఈ చిత్రంతో తోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. అంతటి గొప్ప డైరెక్టర్ కి దరువు మీడియా తరుపున జన్మదిన శుభాకాంక్షలు..!