తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతీని పెంచేసాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం చేస్తున్నాడు. అయితే ఇక సాలు విషయానికి వస్తే ఈరోజు జక్కన్న పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కి బర్త్ డే విషెస్ తెలియజేసారు. “హ్యాపీ బర్త్ డే రాజమౌళి గారు. మీ ఇన్స్పిరేషన్ తో యువకులను ఇలానే ప్రోత్సాహించాలని అన్నారు”. ఇక మహేష్ ఇప్పటివరకు రాజమౌళితో ఒక్క సినిమా కూడా తీయలేదు. త్వరలో జక్కన్న మహేష్ తో సినిమా తీస్తున్నాడనే సమాచారం వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే మహేష్ నే జక్కన్నను బాహుబలి లాంటి చిత్రం తీయమని అడిగాడట. దానికి ఆయన నో చెప్పడం జరిగింది. అయితే ఈ విషెస్ తో మరోసారి అతడిపై కన్ను పడిందా అన్నట్టు అనుకుంటున్నారు.
Wishing our most Iconic director @ssrajamouli a very happy birthday. May you continue to inspire an entire generation of filmmakers. Have a great year ahead! ???
— Mahesh Babu (@urstrulyMahesh) October 10, 2019