మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తన అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు తనకి ఎటువంటి సంభందం లేదని క్లారిటీ ఇచ్చారు. అసలు నాకు ట్విట్టర్, పేస్ బుక్ అకౌంట్లు లేవని ఆయన అన్నారు. ఆయన తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు చిరంజీవి ఎమ్మెల్యేగా ఉన్నారని, అప్పుడు మా మధ్య మంచి సంబంధమే ఉందని అన్నారు. జగన్, చిరంజీవి మధ్య ఎటువంటి సంత్సబంధాలు ఉండకూడదనే ఆలోచనలతో టీడీపీ వాళ్ళే ఇలా చేయిస్తున్నారని అన్నారు. నాకు ఎటువంటి అభిమానాల సంఘాలు లేవని, అలాంటివి మా నాయకుడు జగన్ గారికి ఉంటాయని అన్నారు. నా అభిమాన సంఘం పేరుతో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.