Home / ANDHRAPRADESH / కొంపే కాదు ఆఖరికి పార్టీ ఆఫీస్ కూడా అక్రమ నిర్మాణమేనా చంద్రబాబు..!

కొంపే కాదు ఆఖరికి పార్టీ ఆఫీస్ కూడా అక్రమ నిర్మాణమేనా చంద్రబాబు..!

నీతులు చెప్పడమే కాని.వాటిని ఏ మాత్రం పాటించని కుటిల రాజకీయవేత్త అంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు అనే చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా నిబంధనలను అతిక్రమిస్తూ.. కృష్ణానది కరకట్టపై ఉన్న తన అక్రమ నివాసంలో ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తూ ప్రజావేదికను కట్టాడు. వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా చంద్రబాబు అక్రమ నివాసంలో కట్టిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేసింది. ఈ ప్రజావేదికను కూల్చద్దు..తనకు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రభుత్వానికి లేఖ కూడా రాశాడు. ఇక ప్రజావేదికతో పాటు వరద ముంపుకు గురైన చంద్రబాబు అక్రమ నివాసాన్ని కూడా కూల్చివేయాలంటూ సీఆర్‌డీఏ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. అయినా చంద్రబాబు తనకు రాజధానిలో ఇల్లు కూడా లేకుండా చేస్తున్నారంటూ…డ్రోన్ కెమెరాలు నా ఇంటి చుట్టూ తిప్పుతున్నారని, నాకు రక్షణ లేదని గగ్గోలు పెట్టాడు. ఎల్లో మీడియాలో కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయించాడు. ఇలా అక్రమ నివాసంలో ఉంటూ కూడా తనను తాను సమర్థించుకోవడం, ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం ఒక్క చంద్రబాబుకు చెల్లింది.

తాజాగా చంద్రబాబు ఉంటున్న అక్రమ నివాసమే కాదు.. పార్టీ ఆఫీస్ కూడా అక్రమ నిర్మాణం అన్న విషయం బయటపడింది. ఆత్మకూరు గ్రామ జాతీయరహదారి వెంట భారీ ఎత్తున టీడీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం నిబంధనలను అతిక్రమించి 3.65 ఎకరాల ప్రభుత్వ వాగు పోరంబోకు స్థలాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది.అయితే వాగు స్థలంతో పాటు, కొందరు ప్రైవేట్ రైతుల భూములను ఆక్రమించి పార్టీ ఆఫీసు నిర్మాణం చేపట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిర్యాదులపై విచారణ జరిపించింది. అధికారులు టీడీపీ పార్టీ ఆఫీస్ భవన నిర్మాణ స్థలాన్ని ప్రభుత్వ రికార్డులతో పోల్చి చూడగా…నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ వాగు పోరంబోకు స్థలాన్ని గత చంద్రబాబు సర్కార్ తమ పార్టీ ఆఫీస్‌కు కేటాయించిందన్న విషయం బయటపడింది. దీంతో బాబుగారి బాగోతం బట్టబయలైంది. సదరు పార్టీ ఆఫీస్ భవన నిర్మాణం అక్రమం అని తేలడంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. బాబుగారి కొంపే కాదు..ఆఖరికి పార్టీ ఆఫీసు భవనం కూడా అక్రమకట్టడం అని తేలడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయినా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటూ చంద్రబాబు ఈ అక్రమ పార్టీ ఆఫీస్ బాగోతాన్ని కూడా రాజకీయం చేసేందుకు వెనుకాడడు..ఎందుకంటే ఆయన..చంద్రబాబు..అక్రమమైనా అడ్డగోలుగా ఎదురుదాడి చేసి ఇష్యూను పక్కదారి పట్టించగల ఘనుడు..అంతేగా మరి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat