Home / ANDHRAPRADESH / నారావారికి అస్సలు సిగ్గు ఉండదా..ఎన్ని యూటర్న్‌లు తీసుకుంటారు…!

నారావారికి అస్సలు సిగ్గు ఉండదా..ఎన్ని యూటర్న్‌లు తీసుకుంటారు…!

యూటర్న్ రాజకీయాలకు పెట్టింది పేరైన టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఒకప్పుడు మోదీ హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తా అన్న చంద్రబాబు 2014లో అధికారం కోసం యూటర్న్ తీసుకుని అదే మోదీతో చేతులు కలిపాడు. మోదీ వేవ్‌లో ఆ ఎన్నికల్లో గట్టెక్కిన చంద్రబాబు నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగాడు. ప్రత్యేక హోదాకు మంగళంపాడి ప్యాకేజీకి జై కొట్టాడు. హోదా ఏమైనా సంజీవనా అని వెటకారం ఆడాడు. అయితే ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారడం, తన అవినీతి, అరాచకపాలనకు ప్రజలు విసిగిపోయారని గ్రహించిన చంద్రబాబు సరిగ్గా ఏడాదికి ముందు యూటర్న్ తీసుకున్నాడు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోదీని టార్గెట్ చేశాడు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో డ్రామా దీక్షలు చేశాడు. ఏపీ ప్రజల్లో సెంటిమెంట్ రగిలించి, మోదీని ముద్దాయిగా నిలబెట్టి తాను రాజకీయంగా లబ్ది పొందాలని స్కెచ్ వేశాడు. అందుకోసం ఆగర్భశత్రువు కాంగ్రెస్‌తో చేతులు కలిపాడు. ఏపీని విభజించిన సోనియా, రాహుల్‌గాంధీలతో కలిసి మోదీ దుర్మార్గుడు, రాక్షసుడు అంటూ రంకెలు వేశాడు. దేశమంతటా తిరిగి అన్నిపార్టీల నేతలను ఏకం చేసి మోదీని దించేస్తా అంటూ తొడగొట్టాడు. మోదీ, కేసీఆర్, జగన్‌లు ముగ్గురూ కలిసి ఏపీపై కుట్ర చేస్తున్నారంటూ ఎన్నికల ప్రచారంలో గగ్గోలుపెట్టాడు. అయితే చంద్రబాబు యూటర్న్‌ రాజకీయాలకు విసిగిపోయిన ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా టీడీపీకి ఘోర పరాజయం కట్టబెట్టారు.ఏపీలో వైయస్ జగన్ సీఎం కాగా, కేంద్రంలో మళ్లీ మోదీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. దీంతో చంద్రబాబు మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. బాబు తీరుకు విసిగిపోయిన టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్‌బై చెప్పి…బీజేపీలో చేరుతున్నారు. మరికొంత మంది వైసీపీలో చేరుతున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు రాజకీయంగా పతనావస్థలో ఉన్నాడు. ఒకవైపు వైసీపీ సర్కార్ గత ఐదేళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తోంది. దీంతో చంద్రబాబులో కేసుల భయం వెంటాడుతోంది. అందుకే మళ్లీ కేంద్రంలో ఉన్న మోదీతో స్నేహం కోసం బాబు స్కెచ్ వేస్తున్నాడు. ముందుగా తనకు అత్యంత సన్నిహితులైన సుజనా, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి నేతలను బీజేపీలోకి పంపించాడు. వారి ద్వారా మళ్లీ కేంద్రంతో సఖ్యత కోసం బాబు పడరాని పాట్లు పడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా విశాఖలో జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఓపెన్ అయిపోయాడు. మోదీతో తనకు వ్యక్తిగత వైరం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో విభేదించాం..దానివల్ల రాష్ట్రానికి లాభం జరగలేదు.. పార్టీకి నష్టం జరిగింది.. మోదీతో విబేధించకుండా ఉంటే సీన్ వేరేలా ఉండేదంటూ చెప్పుకొచ్చాడు. దీంతో చంద్రబాబు కాంగ్రెస్‌ను గాలికి వదిలేసి మళ్లీ మోదీ పంచన చేరేందుకు ఇలా బిస్కెట్లు వేస్తున్నాడని అర్థమవుతోంది. బాబూ యూటర్న్‌పై బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు. అవినీతిపరుడైన చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని..బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ కాని, బీజేపీ కేంద్ర నాయకత్వం కాని బాబు యూటర్న్‌లను క్షమించే ప్రసక్తి లేదని, ఎన్నికల సమయంలో మోదీని దుర్మార్గుడు, రాక్షసుడు అంటూ చంద్రబాబు పెట్టిన శాపనార్థాలను తాము మరిచిపోలేదని..ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుంటే గెలిచే ప్రసక్తి లేదని భావించిన చంద్రబాబు ఈ మేరకు మళ్లీ మోదీతో దోస్తానా కోసం ఇలా యూటర్న్ తీసుకున్నాడంటూ బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్‌ పైర్ అయ్యారు. అవినీతిపరుడైన చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబును తాము నమ్మే ప్రసక్తే లేదన్నారు. అసలు ఏ ఏండకా గొడుగుపట్టే చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరకు రానివ్వబోమని… ఈ విషయాన్ని గతంలోనే అమిత్ షా కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో టీడీపీతో ఎలాంటి పొత్తులు ఉండవని సునీల్ దేవ్‌ధర్‌ స్పష్టం చేశారు. మొత్తంగా బాబు అవకాశ రాజకీయాలకు బీజేపీ నేతలతో పాటు, ఏపీ ప్రజలు కూడా అవాక్కు అవుతున్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లుపట్టుకునే రకం చంద్రబాబు అని…మరోసారి మోదీ విషయంలో యూటర్న్‌తో రుజువైందని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చజరుగుతోంది.. ఇక బాబుగారు జన్మలో మారడు అని టీడీపీ నేతలతోపాటు, ఏపీ ప్రజలు అంటున్నారు. మొత్తంగా సిగ్గులేకుండా మళ్లీ మోదీతో దోస్తానా కోసం చంద్రబాబు పడుతున్నపాట్లు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat