తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన మొత్తం నలబై ఎనిమిది వేల మంది సిబ్బంది గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్రంలో ప్రజలకు ,ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది.
అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో ప్రభుత్వ ,ఎయిడెడ్ ,ప్రైవేట్ జూనియర్,డిగ్రీ కాలేజీలకు ,పాలిటెక్నిక్ ,ఇంజినీరింగ్,లా ,ఎంబీఏ,ఎంసీఏ,ఫార్మసీ కాలేజీలతో పాటుగా అన్ని యూనివర్సీటీలకు ఈ నెల పంతొమ్మిదో తారీఖు వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా విద్యార్థులు నష్టపోకుండా ఏఫ్రిల్ వరకు రెండో శనివారం కూడా తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి విద్యాశాఖకు సూచించారు.