Home / ANDHRAPRADESH / అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ నివేదిక సిద్ధం..!

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ నివేదిక సిద్ధం..!

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజధానిపై శివరామ కృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను బుట్టలో పడేసి, మూడు పంటలు పండే సారవంతమైన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాడు. అయితే ఈ విషయాన్ని ముందే ప్రకటించకుండా..తన అనుయాయులు, తన సామాజికవర్గ నేతలతో కుమ్మక్కై విజయవాడ, గుంటూరు, నూజివీడు ప్రాంతాల్లో పేద రైతుల దగ్గర చవకగా వేలాది ఎకరాలు కొనిపించాడు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను మభ్యపెట్టి 33 వేల ఎకరాలు సేకరించాడు. అందులో మెజారిటీ శాతం రైతుల పేరుతో కొనుగోలు చేసిన టీడీపీ బినామీ నేతలకు పెద్ద ఎత్తున పరిహారం కట్టబెట్టాడు. దీంతో రాజధాని పేరుతో అమరావతిలో భారీగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ప్రభుత్వ పెద్దలే రైతుల ముసుగులో భూములు కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని.. నాటి ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది.

కాగా ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం.. గత టీడీపీ హయాంలో రాజధాని పేరుతో అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ల్యాండ్‌పూలింగ్ పేరుతో తనకు, తన సామాజికవర్గానికే చెందిన మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు లబ్ది చేకూరేలా చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారని భావించింది. ఈ మేరకు అమరావతి భూముల కుంభకోణంపై ఒక సీఐడీ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో భయపడిన చంద్రబాబు ఎదురుదాడికి దిగాడు. రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ…బాబుతో సహా టీడీపీ నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారు. రాజధాని రైతులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. ఏపీ రాజధానిగా అమరావతి సెంటిమెంట్‌గా మారిన వేళ.. కొద్ది రోజుల పాటు అమరావతిలో ఏదో జరుగరానిది జరుగబోతుందంటూ ప్రజల్లో భయాందోళన రేకెత్తించారు. ఇక ఎల్లోమీడియా అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందంటూ వరుస డిబెట్లు, పచ్చ కథనాలతో బాబుగారి డ్రామాను రక్తికట్టించింది. అయితే ప్రభుత్వం మాత్రం అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. దీంతో రాజధానిపై ప్రజల్లో నెలకొన్న భయాందోనళలు వీడాయి.

తాజాగా అమరావతి భూముల కుంభకోణంపై రాజధానిలో పర్యటించి విచారణ జరిపిన సీఐడీ కమిటీ తన నివేదకను సిద్ధం చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలోని నేలపాడు, తుళ్లూరు, దొండపాడు, ఇనవోలు, శాఖమూరు, నీరుకొండ, కురగల్లు,ఉండవల్లి, వెంకటపాలెం గ్రామాల్లో పర్యటించిన సీఐడీ అధికారులు రాజధానిగా అమరావతిని ప్రకటించిక ముందు నుంచి, గత ఐదేళ్లలో జరిగిన క్రయవిక్రయాలు, బినామీలపేర్లతో జరిగిన భూలావాదేవీలు, రిజిస్ట్రేషన్లపై రైతుల నుంచి వివరాలు సేకరించారు. ఎవరెవరు భూములు కొన్నారు..ఎవరెవరి పేరుతో కొన్నారు, భూముల కొనుగోలు చేసిన వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ అయ్యాయా..వేరే వాళ్ల పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యాయా..భూములు కొనుగోలు చేసిన వారు ఎవరెవరికి వాటిని అమ్మేశారు అనే కోణంలో విచారించిన సీఐడీ అధికారులు అన్ని ఆధారాలను నివేదకలో పొందుపరిచారని సమాచారం. కాగా ఇప్పటికే అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు గతంలో రాజధానిపై చంద్రబాబు సర్కార్ ఇచ్చిన డిజైన్లలో మార్పులు, చేర్పులు చేస్తూ నిర్మాణ పనులను చేపట్టనుంది. ఈ మేరకు నిధులు కూడా ప్రభుత్వం కేటాయించింది. అదే సమయంలో రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతుందని విశ్వసనీయ సమాచారం.ఈ మేరకు సీఐడీ అధికారులు రాజధాని భూముల విషయంలో జరిగిన అవినీతి, అక్రమాల వివరాలను తమ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. రాబోయే రెండు మూడు వారాల్లో ఈ కమిటీ సమర్పించనున్న నివేదికను సీఎం జగన్ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారని సమాచారం. వెంటనే ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఐడీ కమిటీ నివేదికతో చంద్రబాబు, లోకేష్‌లతో సహా టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఆందోళన మొదలైంది. రాజధాని స్కామ్‌లో తామెక్కడ ఇరుక్కుపోతామనే భయంతో వారు కొట్టిమిట్టాడుతున్నట్లు సమాచారం. దీంతో మరోసారి వైసీపీ ప్రభుత్వం కావాలనే కేసులు పెట్టి తమను వేధిస్తుందంటూ రచ్చ రచ్చ చేసి, ఈ స్కామ్‌ నుంచి బయటపడేందుకు బాబు అండ్ కో స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ కమిటీ నివేదిక ఇప్పుడు బాబు బ్యాచ్‌లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈసారి జగన్ కొట్టే దెబ్బకు బాబు బ్యాచ్‌కు మామూలుగా ఉండదని, ఇక టీడీపీ చాఫ్టర్ క్లోజ్ అని..వైసీపీ నేతలు అంటున్నారు. మరి చూద్దాం..రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందో..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat