నభానటేష్ ఇస్మాట్ శంకర్ సినిమాకు ముందు అక్కడక్కడ సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అదే పూరీ లాంటి డైనమిక్ డైరెక్టర్ చేతిలో పడింది. దీంతో అమ్మడు దశ తిరిగిపోయింది. ఏకంగా ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తుంది. అంతేకాదు అమ్మడుకి ఇస్మాట్ సక్సెస్ తో మంచిగానే గిట్టుబాటు అయింది. ఇప్పుడు ఏకంగా బెంజ్ కారు కొనేసింది. తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా తనకి తానుగా బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా చెప్పుకొంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇదే సినిమా సక్సెస్ తో పూరీ ,చార్మీ ఒకరి ఒకరు కూడా కార్లు గిప్ట్ గా ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుంత రెడ్ కార్ తో అమ్మడు అదిరిపోయింది.